కేరళలోని కాలామస్సేరిలో ఆదివారం ఉదయం పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఒకరు మరణించగా.. మరో 23 మంది గాయపడ్డారు. కాలామస్సేరి నెస్ట్ సమీపంలోని ఓ కన్వెన్షన్ సెంటర్‌లో ఉదయం 9.30 సమయంలో పేలుడు సంభవించింది. ఈ ఘటన జరిగినప్పుడు అక్కడ వేల మంది ఉన్నట్లు సమచారం.ప్రత్యక్ష సాక్షులు మాత్రం కన్వెన్షన్ హాల్లో మూడు నుంచి నాలుగు పేలుళ్లు జరిగాయని చెబుతున్నారు. కన్వెన్షన్ హాలులో దాదాపు 2,500 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడికి చుట్టుపక్కల మండలాలైన వరపుజ, అంగమలి, ఎడపల్లి నుంచి భారీ సంఖ్యలో జనాలు వచ్చారు. ప్రార్థన సమయంలో వీరంతా కళ్లు మూసుకొని ఉండగా.. హాలు మధ్యలో భారీ పేలుడు జరిగింది. అనంతరం మరో రెండు మూడు చిన్న పేలుళ్లు జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ కన్వెన్షన్ సెంటర్ లోపలి వైపు నుంచి తాళం వేసి ఉండటంతో క్షతగాత్రులను తరలించడంలో కొంత జాప్యం చోటు చేసుకొంది. ఈ పేలుళ్లలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.
👉 – Please join our whatsapp channel here –