NRI-NRT

యూకేలో దీపావళి సంబరాలు

యూకేలో దీపావళి సంబరాలు

యూకేలో దీపావళి వేడుకలు ప్రారంభం అయ్యాయి. ప్రముఖ ట్రఫాల్గర్ స్క్వేర్‌లో లండన్‌ మేయర్‌ సాధిక్‌ ఖాన్‌ దీపావళి వేడుకలను నిర్వహించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా చేసుకొనే ఈ వేడుకల్లో చిన్నా, పెద్ద అంతా కలిసి ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. యూకేలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఈ వేడకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని అలరించాయి. భారతీయ సాంప్రదాయ నృత్యాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. ఇక దీపావళి వేడుకల్లో ఇండియన్‌ ఫుడ్‌ స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ వేడుకలకు హాజరైన పలువురు మాట్లాడుతూ.. మొదటిసారి దీపావళి వేడుకల్లో పాల్గొన్నామని, ఇదొ ఒక అద్భుతమైన అనుభవం అంటూ తమ సంతోషాన్ని పంచుకున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z