NRI-NRT

ఫ్రాన్స్‌లో దసరా బతుకమ్మ వేడుకలు

ఫ్రాన్స్‌లో దసరా బతుకమ్మ వేడుకలు

ఫ్రాన్స్ తెలుగు కమ్యూనిటీ సద్దుల బతుకమ్మ దసరా సంబరాలు
ఫ్రాన్స్ గ‌డ్డ‌పై ఫ్రాన్స్ తెలుగు కమ్యూనిటీ , దసరా , బతుకమ్మ నిర్వహించింది. అక్టోబర్ 28న సద్దుల బతుకమ్మ వేడుక‌లు నిర్వ‌హించ‌గా.. ఈ వేడుక‌ల‌కు ఆడపడుచులు అందంగా తీర్చిదిద్దిన తమ బతుకమ్మలతో కుటుంబసభ్యులను వెంటబెట్టుకుని వచ్చి పారిస్ పట్టణంలోని సందడి చేశారు. మహిళలందరూ బృందాలుగా పాటలు పాడుతూ బతుకమ్మను కొలుస్తూ పులకించిపోయారు. . ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఈ కార్యక్రమం ఆసాంతం జనం రాకతో సందడిగా మారింది. సుమారు 5౦౦ వందల మంది ఈ వేడుకల్లో భాగస్వాములైనట్టు ఫ్రాన్స్ తెలుగు కమ్యూనిటీ బృందం తెలిపింది.

పిల్లలు అమ్మవారి వేషధారణతో దుర్గ అమ్మ వారి విశిష్టత ను తెలియచేసారు
ప్రెసిడెంట్ నీల శ్రీనివాస్ కోఆర్డినేటర్‌ ప్రియదర్శిని , ఫణి కృష్ణ , రవి , ప్రియాంక , హేమంత్ , ఉపేందర్ నాతి ,హరి కిశోరె ,సురేష్, నర్సింహా , శ్రీకాంత్ , భువన్ , సాయి నేతృత్వంలో నిర్వహించిన ఈ సంబరాల్లో సద్దుల బతుకమ్మకు దసరా పండగ తోడవడంతో పారిస్ అంతా ఉత్సాహంగా, కలర్‌ఫుల్‌గా కనిపించింది.

ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ వేడుకల్లో సాయంత్రం 6 గంటల వరకు ఔత్సాహికుల భాగస్వామ్యంతో కూడిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఆ తర్వాత బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయి. ఇక బతుకమ్మ వేడుక‌ల‌ అనంతరం అదే వేదికపై దుర్గామాతను ప్రతిష్టించి నిర్వాహకులు శమీపూజ నిర్వహించారు. అమ్మవారిని పల్లకిలో ఊరేగించారు. దసరా పండుగ రోజు బంగారంలా భావించే శమీపత్రాలను ఒకరినొకరు పంచుకుని అలయ్ బలయ్‌ తీసుకున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z