Devotional

ఈ రాశికి మంచి పరిచయాలు ఏర్పడతాయి-రాశిఫలాలు

ఈ రాశికి మంచి పరిచయాలు ఏర్పడతాయి-రాశిఫలాలు

మేషం

వ్యాపారాలు నిదానంగా కొనసాగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. ఇంటా బయటా అనుకూల పరిస్థితులుంటాయి. ముఖ్యమైన వ్యవహారాలు చాలావరకు పూర్తవుతాయి. ప్రయాణాల వల్ల ప్రయోజనం ఉంటుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెంచడం మంచిది. కుటుంబంలో ఒక శుభ కార్యం జరిగే అవకాశం ఉంది. బంధుమిత్రుల రాకపోకలు ఉంటాయి. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. ఆర్థిక లావాదేవీలు లాభి స్తాయి.

వృషభం

వృత్తి, ఉద్యోగాలలో ఆశించినంతగా అనుకూల వాతావరణం ఉంటుంది. అధికారులు మీ మీద ఆధారపడతారు. వ్యాపారాలలో ఆర్థిక పురోగతి ఉంటుంది. ఇంట్లో కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనులు సకాలంలో సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో కలిసి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మీద దృష్టి పెడతారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా, హ్యాపీగా సాగిపోతాయి.

మిథునం

వ్యాపారాలు కూడా నిలకడగా కొనసాగుతాయి. వ్యాపారానికి సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగానే సాగిపోతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. చేపట్టిన పనుల్లో, వ్యవహారాల్లో కొద్దిగా పురోగతి ఉంటుంది. ఇష్టమైన బంధుమిత్రులను కలుసుకుంటారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. దైవ దర్శనం చేసుకుంటారు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా సాగు తాయి.

కర్కాటకం

వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారంలో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో వ్యయ ప్రయాసలుంటాయి. పెండింగు పనులు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి చాలావరకు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఆస్తి సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. ఆదాయం పెరుగుతుంది. వ్యక్తిగత సమ స్యలపై దృష్టి కేంద్రీకరిస్తారు. ప్రయాణాల్లో జాగ్తత్తగా ఉండాలి. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు.

సింహం

వృత్తి, ఉద్యోగాల్లో కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రత్యేక బాధ్యతలు స్వీకరించాల్సి వస్తుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆదాయం నిలకడగా ఉన్నప్పటికీ, వృథా ఖర్చులు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. మంచి సంస్థలోకి ఉద్యోగం మారడానికి అవకాశాలున్నాయి. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగువేయడం అవసరం.

కన్య

వృత్తి, వ్యాపారాలలో కొన్ని జటిల సమస్యలు ఎదురు కావచ్చు. ఉద్యోగ వాతావరణం ప్రోత్సాహ కరంగా ఉంటుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేయడం జరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేయడంలో అవాంతరాలు ఎదురవుతాయి. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. అనా రోగ్య సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందుకు దూసుకుపోతారు.

తుల

వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు, చేతకు తిరుగుండదు. వ్యాపారాల్లో అనుకూల పరిస్థితులుం టాయి. తోబుట్టువులతో ఆస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వాహనం గానీ, విలువైన వస్తువులు గానీ కొనే అవకాశం ఉంది. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం కూడా శ్రేయస్కరం కాదు. ప్రేమ వ్యవహారాల్లో సాన్నిహిత్యం బాగా పెరుగు తుంది.

వృశ్చికం

వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. ఇంటా బయటా గౌరవమర్యాదలు పెరు గుతాయి. ఆశించిన స్థాయిలో పురోగతి ఉంటుంది. అనుకోకుండా కొందరు దూరపు బంధువులను కలుసుకుంటారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. కీలకమైన వ్యవహారాలను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ వ్యవహారాలలో కొద్దిగా అపార్థాలకు అవకాశం ఉంది.

ధనుస్సు

వృత్తి, ఉద్యోగాలలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ప్రమోషన్ రావడం గానీ, ఇష్టమైన ప్రాంతానికి బదిలీ కావడం గానీ జరగవచ్చు. బంధుమిత్రులతో మరింతగా సఖ్యత పెరుగుతుంది. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి ఆశించినంతగా ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగ ప్రయ త్నాలకు సానుకూల స్పందన వచ్చే అవకాశం ఉంది. స్వయం ఉపాధి, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా, ఉల్లాసంగా ముందుకు వెడతాయి.

మకరం

ఉద్యోగ, ఆర్థిక పరిస్థితులు ఆశాజనకంగా ఉంటాయి. ముఖ్యమైన ప్రయత్నాలు సఫలం అవు తాయి. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. వృత్తి, వ్యాపారాలు బిజీగా ముందుకు సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. చాలా కాలంగా పెండింగులో ఉన్న ముఖ్యమైన వ్యవహారాలు, పనులను పట్టుదలతో పూర్తి చేయడం జరుగుతుంది. ప్రయాణాలలో వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా ముందుకు వెడతాయి.

కుంభం

వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆర్థిక లావాదేవీల వల్ల ప్రయోజనం ఉంటుంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. ముఖ్యంగా మొండి బాకీలు వసూలు అవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. నిరుద్యో గులు, అవివాహితుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. ప్రేమ వ్యవహారాలు నిలకడగా సాగు తాయి.

మీనం

ప్రధానమైన వృత్తుల వారికి సమయం బాగా అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలను అప్పగించడం జరుగుతుంది. వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. ప్రస్తుతానికి ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవు తాయి. ఖర్చుల విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కుటుంబంలో ఒకరికి దూరప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి.