తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రచారంతో ముందుకు సాగుతుంది. ఒకవైపు అభ్యర్థులు, రాష్ట్ర స్థాయి నేతలు నియోజకవర్గాల్లో పర్యటిస్తుండగా.. అధినేత మాత్రం రోజుకు రెండు, మూడు బహిరంగ సభలకు హాజరవుతూ పార్టీ అభ్యర్థులకు మద్దతివ్వాలన్నారు. నేడు ఖమ్మం జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార సభల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొననున్నారు. సత్తుపల్లి, ఇల్లందులో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలకు గులాబీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేశారు. సీఎం కేసీఆర్ మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో కల్లూరుకు చేరుకుంటారు.
సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు మద్దతుగా ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. ఎమ్మెల్యే సండ్ర ఆధ్వర్యంలో దాదాపు 25 ఎకరాల విస్తీర్ణంలో ఈ సభకు భారీ ఏర్పాట్లు చేశారు. సట్టచతెలన సభకు ఇప్పటికే భారీ ఏర్పాట్లను చేశారు. కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సభా ప్రాంగణంలో ప్రత్యేక షామియానాలు ఏర్పాటు చేశారు. 2018 ఎన్నికల ప్రచార సభ అనంతరం మరోసారి ఎన్నికల సభకు హాజరవుతున్న నేపథ్యంలో నియోజకవర్గానికి కేసీఆర్ ప్రకటిస్తారనే హామీల కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సత్తుపల్లి బహిరంగ సభ అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ హెలికాప్టర్లో ఇక్కడికి చేరుకుంటారు. ఈ సభకు బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే హరిప్రియ, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎంపీ వావిరాజు రవిచంద్ర విస్తృత ఏర్పాట్లు చేశారు.
సాయంత్రం ఇల్లెందు మండలం సుదిమళ్ల స్టేజీ సమీపంలోని బొజ్జాయిగూడెంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొంటారు. 20 ఎకరాల్లో బహిరంగ సభకు ఏర్పాట్లు చేయగా.. ఇల్లెందు, టేకులపల్లి, కామేపల్లి, గార్ల, బయ్యారం మండలాల నుంచి కార్యకర్తలను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. సీఎం కేసీఆర్ పాల్గొనే 2 బహిరంగ సభలకు పోలీసు శాఖ భారీ ఏర్పాట్లు చేసింది. కల్లూరు సభా ప్రాంగణాన్ని ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణువారియర్ పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇల్లెందు సభా ప్రాంగణాన్ని భద్రాద్రి జిల్లా ఎస్పీ పరిశీలించారు.
👉 – Please join our whatsapp channel here –