ఉమ్మడి నల్లగొండ జిల్లాను మరోసారి క్లీన్ స్వీప్ చేయాలన్న లక్ష్యంతో బీఆర్‌ఎస్ (BRS) పార్టీ ప్రచారం ముమ్మరం చేసింది. ఉమ్మడి జిల్లాలోని భువనగిరి, మునుగోడు, ఆలేరు, తుంగతుర్తి, కోదాడలో ఇప్పటికే ప్రజా ఆశీర్వద సభలు (Praja Ashirvada Sabha) నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR).. మరోసారి జిల్లాకు రానున్నారు. మంగళవారం హుజూర్‌నగర్, మిర్యాలగూడ, దేవరకొండలో సుడిగాలి పర్యటన చేయనున్నారు. మూడు నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తారు.బీఆర్‌ఎస్ అధినేత మధ్యాహ్నం 1.30 గంటలకు హైదరాబాద్ నుంచి హుజూర్‌నగర్‌కు చేరుకుంటారు. పట్టణంలోని రామస్వామి గుట్టకు వెళ్లే మార్గంలోని ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగిస్తారు. అనంతరం మిర్యాలగూడ బయల్దేరుతారు. మధ్యాహ్నం 2.30 గంటలకు మిర్యాలగూడకు చేరుకుంటారు. పట్టణంలోని ఎన్‌ఎస్‌పీ క్యాంపు మైదానంలో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటారు. సభ ముగిసిన తర్వాత దేవరకొండలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు.
👉 – Please join our whatsapp channel here –