Politics

కామారెడ్డి పై కేటీఆర్‌ ఫోకస్‌

కామారెడ్డి పై కేటీఆర్‌ ఫోకస్‌

కామారెడ్డి గులాబి పార్టీలో గ‌త కోద్ది రోజులుగా జ‌రుగుతున్న అంత‌ర్గ‌త పోరుపై సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు బీఆర్‌ఎస్‌ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌. గ‌త కోద్ది రోజులుగా సీఎం పోటీ చేస్తున్నా సరే.. మాకేంటి అన్న తీరులో ప్ర‌వ‌ర్తిస్తున్న కామారెడ్డి లీడ‌ర్ల‌కు షాక్ ఇచ్చారు మంత్రి కేటీఆర్‌.

కామారెడ్డి నియోజకవర్గం నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్నప్పటికీ నియోజకవర్గంలోని పలువ రు సీనియర్ నేతల మధ్య విభేదాలు సద్దుమనగడం లేదు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తల సమక్షంలోనే పలువురు నేతలు వాగ్వాదానికి దిగుతుండగా ఆ పార్టీకి తలనొప్పిగా మా రుతోంది. తాజాగా కామారెడ్డి నియోజకవర్గానికి చెందిన ఇద్దరు సీనియర్ నేతలు తోటి కార్యకర్తల ముందే వాగ్వాదానికి దిగడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కామారెడ్డి పట్టణ శివారులోని శుభం ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ స్థాయి సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ సమక్షంలో దోమకొండ మండలానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు బీఆర్‌ఎస్‌లో చేరారు.

ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్, రాష్ట్ర నాయకుడు తిరుమ‌ల్ రెడ్డి , కామారెడ్డి పట్టణ నాయకుడు మున్సిపల్ వైస్ చైర్మన్ భర్తగడ్డం చంద్రశేఖర్రెడ్డిలు వేదికపైనే వాగ్వా దానికి దిగారు . అయితే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ వద్ద తనపై చెడుగా చెప్పారని దుష్ప్రచారం చేశారని అందుకే పలు కార్యక్ర మాలకు సమన్వయ కమిటీ దూరంగా ఉంచుతుందంటూ ఆగ్రహంతో ఉన్న చంద్రశేఖర్ రెడ్డి వేదికపైకి వచ్చి తిర్మల్ రెడ్డిని నిలదీశారు. వీరి ఇద్దరి మధ్య మాటమాట పెరిగి తీవ్ర వాగ్వాదానికి దారి తీసినట్లు సమాచారం. అయితే ఈ తతంగమంతా ప్రభుత్వ విప్ గం ప గోవర్ధన్ తో పాటు పార్టీ సీనియర్ నేతలు ముజిబుద్ధీన్, పున్న రాజే శ్వర్, నర్సింగ్గావుల ఎదుటే జరగడంతో తోటి కార్యకర్తలు ఆశ్చర్యానికి గురయ్యారు. చంద్రశేఖర్రెడ్డి, తిర్మల్రెడ్డిల వాగ్వాదంతో మరోసారి నియోజకవర్గ నేతల మధ్య విభేదాలు బహిర్గతం అయ్యాయి.

ఇదిలా ఉంటే వారం క్రితమే ప్రగతి భవన్‌లో మంత్రి కేటీఆర్ ఎదుటే పలువురు ముఖ్యనేతలు వాగ్వాదానికి దిగడంతో.. మంత్రి సదరు నేతలను తీవ్రంగా హెచ్చరించారు. పార్టీకి ఎవరైన వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. అయినప్పటికీ నియోజకవర్గంలోని పలువురు నేతల తీరు మాత్రం మారడం లేదు. నేతల మధ్య విభేదాలు తలెత్తుతూనే ఉన్నాయి. ఇందుకు జరిగిన ఘర్షణే నిదర్శనం. ఈ వ్యవహారాన్ని మంత్రి దృష్టికి తీసుకువేళ్ల‌డంతో సీరియస్‌గా రియాక్ట్ అయిన మంత్రి వెంట‌నే సస్పేండ్ చేయాల‌ని ఆదేశించారు. దీంతో మున్సిప‌ల్ వైస్ చైర్ ప‌ర్స‌న్ గడ్డం ఇందూ ప్రియ భ‌ర్త గడ్డం చంద్రశేఖ‌ర్ రెడ్డిని పార్టీలో నుంచి స‌స్పేండ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. కామారెడ్డి జిల్లా ఎన్నిక‌ల ఇంచార్జ్ శేరి సుభాష్ రెడ్డి ఆమేర‌కు ఉత్త‌ర్వులు కూడ జారీ చేశారు. దీంతో పార్టీలో ఏవ‌రు గీత దాటినా వేటు త‌ప్ప‌దు అనే సందేశం ఇచ్చిన‌ట్లు అయింది.

కామారెడ్డిలో బీఆర్‌ఎస్‌కు బిగ్‌షాక్‌..ఇదిలా ఉంటే.. కామారెడ్డి బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ తగిలింది. బీఆర్ఎస్ పార్టీకి కామారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ గడ్డం ఇందు ప్రియా రాజీనామ చేశారు. రాజీనామా లేఖను కామారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షులు ఎంకే ముజీబొద్దీన్‌కు అందజేశారు. అంతేకాకుండా పార్టీకి 16వ వార్డు కౌన్సిలర్ చాట్ల వంశీ సైతం రాజీనామా చేశారు. బీఆర్ఎస్ పట్టణ ఉపాధ్యక్షులు కనపర్తి అరవింద్, బీసీ సెల్ సెక్రటరీ బల్ల శ్రీనివాస్, యూత్ వైస్ బండారి శ్రీకాంత్ లు పార్టీకి రాజీనామా చేశారు. వీరితో పాటు యూత్ కమిటీ పదవులకు ఇమ్రాన్, వేణు, చేవెళ్ల రాజులు రాజీనామా చేశారు. సూర్య బాయ్ యూత్, టీఆర్‌ఎస్‌ సభ్యత్వంకు గడ్డం సురేందర్ రెడ్డి రాజీనామా చేశారు. పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్ అలీ సమక్షంలో కామారెడ్డి మున్సిపాల్ వైస్ చైర్మన్, బీఆర్‌ఎస్ నేతలు కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z