* కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ ఫైర్
దేశంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కలకలం రేపుతోంది. తమ ఐఫోన్లను హ్యాక్ చేస్తున్నారంటూ కొందరు ప్రతిపక్ష ఎంపీలు ఆరోపించారు. ఫోన్ కంపెనీల నుంచి తమకు వార్నింగ్ మెజేస్‌లు వచ్చాయంటూ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. మంగళవారం ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.దేశంలో విపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయన్నారు. కాంగ్రెస్‌కు చెందిన ముఖ్య నేతలు కేసీ వేణుగోపాల్, పవన్ ఖేడా, సుప్రీయా శ్రీనాథ్‌లకు యాపిల్ కంపెనీ నుంచి హెచ్చరిక మెయిల్ వచ్చిందన్నారు. వీరితో పాటు ఎన్సీపీ చీఫ్ అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా, సీపీఎం నేత సీతారాం ఏచూరీలకు సైతం వార్నింగ్ మెయిల్ వచ్చిందన్నారు. తన కార్యాలయంలోని చాలా మందికి ఇలాంటి సందేశాలు వచ్చినట్లు చెప్పారు.హ్యాకింగ్‌కు కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అదానీని కాపాడేందుకే ఈ ఫోన్ ట్యాపింగ్స్ అంటూ ధ్వజమెత్తారు. అయితే, ఫోన్ ట్యాపింగ్‌లకు తాము భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఎంత ట్యాపింగ్ చేయాలనుకుంటే అంత చేసుకోవచ్చని అన్నారు. తన ఫోన్ కావాలన్నా ఇస్తానని.. ట్యాపింగ్ చేసుకోవచ్చంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌కు పెరుగుతున్న ఆదరణ చూసి కేంద్రంలోని బీజేపీ ఓర్వలేకపోతందన్నారు. అందుకే విపక్షాలను అనేక ఇబ్బందులకు గురి చేయాలని భావిస్తోందని ఆరోపించారు. ఇందులో భాగంగానే ఫోన్ ట్యాపింగ్‌లకు పాల్పడుతోందంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.కాగా, ఈ ఉదయం విపక్ష ఎంపీలు తమ ఫోన్లు హ్యాకింగ్‌కు గురయ్యాయని ఆరోపించిన విషయం తెలిసిందే. తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా, కాంగ్రెస్ నేతలు ప్రియాంకా చతుర్వేది, శశి థరూర్, పవన్ ఖేరా, ఆప్ ఎంపీ రాఘవ చద్దా, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ .. తమ ఫోన్లు హ్యాక్ అవుతున్నట్లు తెలిపారు. ఫోన్ కంపెనీల నుంచి తమకు వార్నింగ్ మెసేజ్‌లు వచ్చినట్లు వారు పేర్కొన్నారు. ప్రభుత్వంతో లింకున్నసైబర్ నేరగాళ్లు తమ ఫోన్లను హ్యాక్ చేసే ప్రయత్నం చేస్తున్నట్లు తమకు మెసేజ్‌లు వస్తున్నట్లు ఆ ఎంపీలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎంపీలకు చెందిన ఐఫోన్లను హ్యాకర్లు టార్గెట్ చేస్తున్నట్లు యాపిల్ సంస్థ కొందరికి వార్నింగ్ మెసేజ్‌లను పంపింది.
* కొత్త ప్రభాకర్ రెడ్డి హెల్త్ బులెటిన్ విడుదల
మెదక్ బీఆర్ఎస్ ఎంపీ, దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై సోమవారం కత్తితో దాడి జరిగిన విషయం తెలిసిందే. ఇక, యశోద వైద్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి హెల్త్ బులెటిన్ ను విడుదల చేశారు. ఎంపీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పలేమన్నారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స అందిస్తున్నామన్నారు. ఐసీయూలో 5 రోజుల పాటు చికిత్స అందిస్తామన్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డికి ఇన్ ఫెక్షన్ లక్షణాలు ఉన్నాయన్నారు. ఎంపీ కాన్సియస్ గా ఉన్నారని, రికవరీ ప్రాసెస్ గురించి ఆయనకు వివరించినట్లు వైద్యులు తెలిపారు. పదిహేను రోజుల తర్వాత కుట్లు తీస్తామన్నారు. ఇది మేజర్ సర్జరీ అని, రికవరీకి కొంత సమయం పడుతుందన్నారు.
* 2న కేజ్రీవాల్ అరెస్టు
మద్యం కుంభకోణం కేసు (Delhi excise policy scam case)లో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు సమన్లు జారీ అయిన విషయం తెలిసిందే. నవంబరు 2న ఆయన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ఎదుట హాజరుకానున్నారు. అయితే ఆ సమయంలో కేజ్రీవాల్‌ను అరెస్టు చేసే అవకాశాలున్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) సంచలన ఆరోపణలు చేసింది. ఈ మేరకు దిల్లీ మంత్రి అతిషీ మీడియాతో మాట్లాడుతూ కేజ్రీవాల్ అరెస్టుపై అనుమానాలు వ్యక్తం చేశారు.నవంబరు 2న కేజ్రీవాల్‌ను అరెస్టు చేసే అవకాశాలున్నాయని సమాచారం అందింది. ఒకవేళ ఆయన అరెస్టయితే.. అవినీతి ఆరోపణలపై మాత్రం కాదు. భాజపాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనే..! దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాను ఆమ్ ఆద్మీ పార్టీ రెండు సార్లు ఓడించింది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఆప్ చేతిలో ఆ పార్టీ ఓటమిపాలైంది. కేజ్రీవాల్‌ను చూసి ప్రధాని మోదీ భయపడుతున్నారు. ఎన్నికల్లో కేజ్రీవాల్‌ను ఓడించలేమని భాజపాకు అర్థమైంది. అందుకే ఇలా తప్పుడు కేసులు పెడుతోంది’’ అని అతిషీ దుయ్యబట్టారు.‘ఇప్పటికే ఆప్ నేతలు మనీశ్ సిసోదియా, సత్యేందర్ జైన్, సంజయ్ సింగ్‌ను భాజపా అరెస్టు చేయించింది. ఇలా నేతలను జైలుకు పంపించి ఆప్‌ను సమూలంగా అడ్డు తొలగించుకునేందుకు భాజపా ప్రయత్నిస్తోంది. కేజ్రీవాల్ అరెస్టు తర్వాత.. ఇండియా కూటమిలోని ఇతర నేతలను కూడా భాజపా టార్గెట్ చేస్తుంది. విపక్ష పార్టీలకు చెందిన సీఎంలపై సీబీఐ, ఈడీతో దాడులు చేయించే అవకాశాలున్నాయి. ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, కేరళ సీఎం పినరయి విజయన్ వంటి వారు భాజపా టార్గెట్ లిస్ట్‌లో ఉన్నారు’’ అని అతిషీ ఆరోపించారు. అయితే, ఇలాంటి దాడులకు ఆప్ నేతలు భయపడబోరని ఆమె అన్నారు.మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా నవంబరు 2న (గురువారం) ఉదయం 11 గంటలకు తమ ఎదుట హాజరు కావాలంటూ కేజ్రీవాల్‌కు ఈడీ అధికారులు సోమవారం సమన్లు జారీ చేశారు. ఈ కేసులో కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు ఇవ్వడం ఇదే తొలిసారి. అయితే, అంతకుముందు ఈ ఏడాది ఏప్రిల్‌లో సీబీఐ ఆయనను మద్యం కుంభకోణం కేసులో కొన్ని గంటల పాటు ప్రశ్నించిన విషయం తెలిసిందే.
* ప్రభాకర్ రెడ్డి ఘటనపై కేటీఆర్ ట్వీట్
మెదక్ ఎంపీ, సిద్దిపేట జిల్లా దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై హత్యాయత్నం ఘటన రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనను బీఆర్ఎస్ నేతలు ముక్తకంఠంతో తిరస్కరించారు. దీని వెనక కాంగ్రెస్ పార్టీ హస్తం ఉందని ఆరోపించారు. ప్రభాకర్ రెడ్డిపై దాడి చేసిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తేనని అన్నారు. బీఆర్ఎస్ ఆరోపణలను తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్.. తమ పార్టీ అలాంటి హింసను ప్రేరేపించదని స్పష్టం చేశారు.మరోవైపు ఈ ఘటన వెనుక ఏ పార్టీ, ఎవరు ఉన్నారనేది పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ ద్వారా స్పందించారు. ప్రభాకర్ రెడ్డిపై దాడి చేసింది కాంగ్రెస్ గూండానే అంటూ.. ఆ పార్టీ కండువాతో ఉన్న నిందితుడి ఫొటోలను పోస్ట్ చేశారు. ఇంకా ఆధారాలు కావాలా అని రాహుల్ గాంధీని కేటీఆర్ ప్రశ్నించారు.
* కొత్త ప్రభాకర్‌రెడ్డిని పరామర్శించిన మంత్రి హరీష్‌రావు
కత్తి దాడి కేసులో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిని మంత్రి హరీష్‌రావు పరామర్శించారు. ప్రభాకర్‌రెడ్డి ఆరోగ్యం మెరగవుతుందని.. వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారన్నారు. సీనియర్ నేతలు కూడా చిల్లర కామెంట్స్ చేస్తున్నారని.. కోడికత్తి అని అపహాస్యం చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీకి అలాంటి అవసరం లేదన్నారు మంత్రి హరీష్‌రావు.
* రాజమండ్రి నుంచి భారీ ఊరేగింపుగా ఉండవల్లికి చంద్రబాబు
స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో జైలు సిబ్బంది సైతం చంద్రబాబు బ్యాకర్కు వెళ్లినట్లు తెలుస్తోంది. హైకోర్టు ఆదేశాలు ఇప్పటికే విడుదలైన నేపథ్యంలో మధ్యాహ్నాం 3 గంటలకు చంద్రబాబు నాయుడు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో చంద్రబాబు జైలు నుంచి విడుదలైనప్పుడు ఘన స్వాగతం పలికేందుకు టీడీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి జాతీయ రహదారి మీదుగా భారీ ఊరేగింపుతో చంద్రబాబు విజయవాడ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అక్కడ నుంచి ఉండవల్లిలోని తన నివాసానికి చంద్రబాబు నాయుడు చేరుకుంటారని తెలుస్తోంది. రాజమండ్రి నుంచి విజయవాడకు చంద్రబాబు వెళ్లే రూట్ మ్యాప్‌ను టీడీపీ సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతుంది. దీనిపై చర్చించేందుకు రాజమండ్రి క్యాంపు సైట్లో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌తో సమావేశమై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీవారిని దర్శించుకుని అనంతరం హైదరాబాద్ వెళ్తారని తెలుస్తోంది. హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో కంటికి శస్త్రచికిత్స చేయించుకుంటారని తెలుస్తోంది.మధ్యాహ్నాం 3 గంటలకు రాజమహేంద్రవరం జైలు నుంచి ఈ భారీ ఊరేగింపు జరగనుంది. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు(రాజమండ్రి సిటీ),లాలా చెరువు(రాజానగరం),మోరంపూడి(రాజమండ్రి సిటీ), బొమ్మూరు(రాజమండ్రి రూరల్), వేమగిరి(రాజమండ్రి రూరల్), జొన్నాడ సెంటర్(మండపేట) రావులపాలెం(కొత్తపేట), సిద్ధాంతం సెంటర్(ఆచంట), పెరవలి(నిడదవోలు), తణుకు(తణుకు), తాడేపల్లిగూడెం(తాడేపల్లిగూడెం, నల్లజర్ల మండలం గోపాలపురం), భీమడోలు(ఉంగుటూరు, ద్వారకా తిరుమల మండలం(గోపాలపురం), దెందులూరు, ఏలూరు, హనుమాన్ జంక్షన్(గన్నవరం, నూజివీడు, గుడివాడ), గన్నవరం, రామవరప్పాడు రింగ్ రోడ్(విజయవాడ ఈస్ట్, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్),బెంజ్ సర్కిల్( విజయవాడ ఈస్ట్, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్,పెనమలూరు),కనకదుర్గ వారధి(విజయవాడ ఈస్ట్, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, గుంటూరు పార్లమెంట్), మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి మీదుగా ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. మధ్యాహ్నాం 3 గంటల నుంచి ప్రారంభం కానున్న ఈ ఊరేగింపు రాత్రి 9.20 గంటలకు ఉండవల్లిలో ముగుస్తుంది అని టీడీపీ వెల్లడించింది.
* బీఆర్ఎస్లో చేరిన నాగం జనార్ధన్ రెడ్డి
మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో గులాబీ గూటికి చేరారు. ఈ సందర్భంగా నాగం జనార్ధన్ రెడ్డికి కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నాగం మద్దతుదారులు కూడా భారీ సంఖ్యలో కారెక్కారు.సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాగం జనార్దన్‌రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు. వైఎస్ హయాంలో ఓబులాపురం మైనింగ్ కుంభకోణంపై పోరాటం చేసిన నాయకుడిగా గుర్తింపు పొందారు. బీజేపీలో కొంతకాలం పనిచేశారు. తరువాత ‘తెలంగాణ నగారా’ పార్టీని స్థాపించారు. ఆ తరువాత కాంగ్రెస్‌లో చేరారు. ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఇవాళ బీఆర్ఎస్లో చేరారు.
* ఒడిశా గవర్నర్‌గా రఘుబర్ దాస్ ప్రమాణస్వీకారం
ఒడిశా రాష్ట్ర నూతన గవర్నర్‌గా ఇటీవలే నియమితులైన రఘుబర్ దాస్ మంగళవారం ఉదయం ప్రమాణస్వీకారం చేశారు. ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విద్యుత్ రంజన్ సారంగి (Justice Bidyut Ranjan Sarangi) ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని గవర్నర్ హౌజ్‌లోగల న్యూ అభిషేక్ హాల్లో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి బీజేడీ అధినేత, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ఆ రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రులు హాజరయ్యారు. ఒడిశా రాష్ట్రానికి 26వ గవర్నర్‌గా రఘుబర్‌దాస్ బాధ్యతలు నిర్వహించనున్నారు. బీజేపీ నాయకుడు అయిన రఘుబర్ దాస్ 2014 నుంచి 2019 వరకు ఐదేళ్లపాటు జార్ఖండ్ ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు.
* చంద్రబాబు గారికి సంపూర్ణ ఆరోగ్యం కలగాలి
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి సంపూర్ణ ఆరోగ్యం కలగాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. ఆయనకి హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడం సంతోషకరమన్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో.. కొత్త ఉత్సాహంతో చంద్రబాబు ప్రజా సేవకు పునరంకితం కావాలని తెలిపారు. ఆయన అనుభవం ఈ రాష్ట్రానికి ఎంతో అవసరమన్న పవన్.. చంద్రబాబు నాయుడు విడుదల కోసం కోట్లాది మంది ఎదురు చూస్తున్నారని.. అందరం ఆయన్ని స్వాగతిద్దామని పిలుపునిచ్చారు.
* మహారాష్ట్రలో 144 సెక్షన్ అమలు
మహారాష్ట్రలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత కొంత కాలంగా మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ డిమాండ్‌తో జరుగుతున్న ఉద్యమం ఇప్పుడు మహారాష్ట్రలో శరవేగంగా వ్యాపిస్తోంది. ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న మనోజ్ జరంగే గత వారం రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. అలానే ఉద్యమంలో పాల్గొన్న యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే చాలంది యువత ప్రాణాలను కోల్పోయారు. కాగా సోమవారం నిరాహార దీక్ష చేస్తున్న మనోజ్ జరంగే ఆరోగ్యం క్షీణించింది. దీనితో ఉద్యమకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ నేపథ్యంలో ఆగ్రహానికి లోనైనా ఉద్యమకారులు ముఖ్యమంత్రి షిండేపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జరంజే పరిస్థితిని చూసి ఉద్వేగానికి లోనైనా ఆందోళనకారులు ఆయన పరిస్థితిని సీఎం పట్టించుకోలేదని ఆరోపించారు.దీనితో ఉద్యమకారులు ఎమ్మెల్యేల నివాసాలకు, కార్యాలయాలకు , దుకాణాలకు నిప్పు పెడుతున్నారు. దీనితో మహారాష్ట్రలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో అధికారులు సెక్షన్ 144 విధించింది. అలానే ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. కాగా ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలని దాదాపు 32 ఏళ్ల క్రితం మరాఠా రిజర్వేషన్‌పై తొలిసారి ఉద్యమం జరిగింది. ఈ ఉద్యమానికి మత్తడి లేబర్ యూనియన్ నాయకుడు నాయకత్వం వహించారు. అయితే మనోజ్ జరంగే నేతృత్వంలో ఈ ఉద్యమం మళ్ళీ మొదలయింది. ఈయన జాల్నాలో నిరాహార దీక్షకు కూర్చున్నారు. కాగా బీడ్ జిల్లాలో నిరసనకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు దీనితో బీడ్ ఉద్యమానికి కేంద్రంగా మారింది.
👉 – Please join our whatsapp channel here –