Fashion

లక్ష్యాన్ని సులువుగా చేరుకునే మార్గం

లక్ష్యాన్ని సులువుగా చేరుకునే మార్గం

డిఫరెంట్ ఎమోషన్స్ మనిషిని ఎలా మోటివేట్ చేస్తాయో వివరించింది USలోని టెక్సాస్ A & M యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనం. పాజిటివ్ ఎమోషన్స్ తోపాటు కోపం, విసుగు, విచారం వంటి నెగెటివ్ ఎమోషన్స్ కూడా టార్గెట్ రీచ్ కావడంలో ఉపయోగపడతాయని గుర్తించింది. 1,000 మంది వ్యక్తులపై చేసిన ప్రయోగం, 1,400 మంది పాల్గొన్న సర్వే ఫలితాలు అధ్యయనం చేయడం ద్వారా ఈ విషయాన్ని గుర్తించారు. ఇందులో భాగంగా ఫొటోలను చూడటం ద్వారా.. కోపం, ఆనందం, దుఃఖం లేదా న్యూట్రల్ ఎమోషన్స్ పొందేలా ప్రయోగాలు రూపొందించబడ్డాయి. ఒక టాస్క్ లో వ్యక్తులు వర్డ్ పజిల్‌లను పరిష్కరించడం, మరో టాస్క్ లో స్కీయింగ్ వీడియో గేమ్‌లో అధిక స్కోర్‌ను పొందడాన్ని లక్ష్యంగా ఇచ్చారు. ఇక ఈ ప్రయోగాల్లో తటస్థ భావోద్వేగంతో పోలిస్తే.. కోపంగా ఉండటం వల్ల టార్గెట్ చేరుకునే సామర్థ్యం మెరుగుపడినట్లు పరిశోధకులు కనుగొన్నారు. కోపంగా ఉన్నవారు ఎక్కువ స్కోర్‌లు సాధించారు. టాస్క్‌లను త్వరగా పూర్తి చేశారు. మొత్తానికి ప్రతికూల భావోద్వేగాలను సాధనాలుగా ఉపయోగించడం కొన్ని పరిస్థితులలో ప్రభావవంతంగా ఉంటుందని కనుగొన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z