Politics

సనాతన ధర్మ పరిరక్షణ కోసం శ్రీవారి కానుకలు కేటాయించాలి

సనాతన ధర్మ పరిరక్షణ కోసం శ్రీవారికి కానుకలు కేటాయించాలి

తిరుమల నడక మార్గంలోని అలిపిరి పాదాల మండపం వద్ద భక్తులు విశ్రాంతి తీసుకునే పురాతన రాతి మండపాన్ని భారత పురావస్తు శాఖ పర్యవేక్షణలో పునర్నిర్మించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి కోరారు. తిరుపతిలో అలిపిరి పాదాల మండపం, రైల్వేస్టేషన్‌ అభివృద్ధి పనులను ఆమె పరిశీలించారు. శ్రీవారి పాదాల మండపం వద్ద ఉన్న గోశాలలో గోవులకు పూజ చేశారు.తిరుమలలో పార్వేట మండపాన్ని పూర్తిగా తొలగించి ఇష్టానుసారంగా నిర్మించారని పురందేశ్వరి మండిపడ్డారు. తిరుమల శ్రీవారికి వచ్చే కానుకలను సనాతన ధర్మ పరిరక్షణకే కేటాయించాలని డిమాండ్‌ చేశారు. తితిదే నిధులు తిరుపతి మున్సిపాలిటీకి ఇవ్వడం సరికాదన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ పన్నుల ద్వారా వచ్చే నిధులు ఎక్కడికి పోతున్నాయని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లోని ఆలయాల్లో ధూపదీప నైవేద్యానికి నిధుల కేటాయింపును పునరుద్ధరించాలని పురందేశ్వరి విజ్ఞప్తి చేశారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z