ScienceAndTech

గణితం సమాధానాలు గూగుల్ చెప్పేస్తుంది

గణితం సమాధానాలు గూగుల్ చెప్పేస్తుంది

గూగుల్ ఇటీవల కాలంలో వరుసగా తన సెర్చింజన్‌ను అప్‌డేట్ చేస్తుంది. ఇప్పటికే AI ఫీచర్లను యాడ్ చేసిన కంపెనీ తాజాగా విద్యార్థులకు, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికోసం సెర్చింజన్‌లో సైన్స్, మ్యాథ్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ వంటి సబ్జెక్టుల ప్రశ్నలకు సులభంగా సమాధానాలు కనుగునేలా కొత్త అప్‌డేట్‌ను తెచ్చింది. మ్యాథ్స్‌లో క్లిష్టమైన ప్రశ్నలు, సమీకరణాలకు సమాధానాలు కావాలంటే ఇకమీదట సెర్చ్ బార్‌లో ప్రశ్నను టైప్ చేయడం లేదా ప్రశ్న ఫొటోను లెన్స్ ద్వారా స్కాన్ చేసి ఆన్సర్ కనుక్కోవచ్చు.సైన్స్, ఫిజిక్స్, ఇంజనీరింగ్ సబ్జెక్టులు, సంక్లిష్టమైన కాలిక్యులస్, త్రికోణమితి సమస్యలను కూడా గూగుల్ సెర్చ్ ద్వారా తెలుసుకునే అప్‌డేట్‌ను కంపెనీ తీసుకొచ్చింది. ఆన్సర్లను కూడా అర్థవంతంగా, 3D కాన్సెప్ట్‌తో స్టెప్‌ బై స్టెప్ యూజర్లు సమాధానాలు త్వరగా అర్థం చేసుకునే విధంగా అందిస్తుంది. గతంలో వివిధ ప్రశ్నలకు సమాధానాలు కనుగొనాలంటే చాలా సమయం పట్టేది, కానీ ఇకమీదట క్షణాల్లో ఆన్సర్లు వస్తాయని కంపెనీ పేర్కొంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z