Sports

ఆసియా హాకీ ఛాంపియన్స్‌గా భారత్

ఆసియా హాకీ ఛాంపియన్స్‌గా భారత్

రాంచీలో జరుగుతున్న మహిళల హాకీ ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీలో భారత జట్టు మరో విజయాన్ని అందుకుంది. టోర్నీలో ఇది భారత్‌కు వరుసగా నాలుగో గెలుపు కావడం విశేషం. మంగళవారం హోరాహోరీగా జరిగిన పోరులో భారత్‌ 2–1 గోల్స్‌ తేడాతో జపాన్‌ను ఓడించింది. భారత్‌ తరఫున నవనీత్‌ కౌర్‌ 31వ నిమిషంలో ఫీల్డ్‌ గోల్‌ సాధించగా…47వ నిమిషంలో సంగీత కుమారి పెనాల్టీని గోల్‌గా మలచింది. జపాన్‌కు లభించిన పెనాల్టీని సద్వినియోగం చేసుకుంటూ 37వ నిమిషంలో ఉరాటా కానా గోల్‌ నమోదు చేసింది. భారత సీనియర్‌ ప్లేయర్‌ వందన కటారియాకు ఇది 300వ అంతర్జాతీయ మ్యాచ్‌ కావడం విశేషం. ఈ సందర్భంగా హాకీ ఇండియా ఆమెను ఘనంగా సన్మానించింది. టోర్నీలో థాయిలాండ్, మలేసియా, చైనా, జపాన్‌లను ఓడించి భారత్‌ నేడు జరిగే మ్యాచ్‌లో కొరియాతో తలపడుతుంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z