Movies

మిల్క్ బ్యూటీ నిశ్చితార్థం డేట్ ఫిక్స్

మిల్క్ బ్యూటీ నిశ్చితార్థం డేట్ ఫిక్స్

సినీ ఇండస్ట్రీలో వరుస పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం వరుణ్, లావణ్య మరికొన్ని గంటల్లో మూడుముళ్లతో ఒక్కటి కాబోతున్నారు. అయితే.. ఇండస్ట్రీలో మరో బ్యూటీ పెళ్లికి రెడీ అయినట్లు తెలుస్తోంది. ఆమె ఎవరో కాదు.. టాలీవుడ్‌లో మిల్క్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న తమన్న. ఇటీవల భోళా శంకర్ మూవీతో అలరించిన ఈ బ్యూటీTamannaah Bhatia పెళ్లిపై నెట్టింట వార్తలు హాట్ హాట్‌గా వైరల్ అవుతున్నాయి.తమన్న, విజయ్ వర్మ ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరు డేటింగ్ చేస్తున్నట్లు ఆఫీషియల్‌గా కూడా ప్రకటించారు. కానీ పెళ్లి మాత్రం అప్పుడే చేసుకోను అంటూ గతంలో తమన్న తెలిపింది. కానీ, ప్రస్తుతం వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం.. సినిమా అవకాశాలు తగ్గడం, అటు విజయ్ వర్మ ఫ్యామిలీ నుంచి కూడా పెళ్లిపై ప్రెజర్ ఎక్కువైతున్నట్లు టాక్. ఈ క్రమంలోనే తప్పక పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిందట ఈ బ్యూటీ. అంతే కాకుండా నవంబర్-17 వ తేదీన వీరి ఎంగేజ్‌మెంట్ డేట్ కూడా ఫిక్స్ చేసినట్లు నెట్టింట వార్తుల జోరుగా ప్రసారం అవుతున్నాయి. అయితే.. నిశ్చితార్థం కేవలం కొద్దిమంది బంధువులతో ఏ ఆర్భాటం లేకుండా ఎంగేజ్‌మెంట్ చేసుకుంటున్నారని సమాచారం. ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ, తమన్న కూడా పెళ్లి పీటలు ఎక్కేస్తుంది అంటూ నెట్టింట కామెంట్లు పెడుతున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z