Business

2 వేల నోట్లపై ఆర్‌బీఐ కీలక ప్రకటన

2 వేల నోట్లపై ఆర్‌బీఐ కీలక ప్రకటన

రెండు వేల రూపాయల నోట్ల ఉపసంహరణ తర్వాత చలామణీలో ఉన్న 97 శాతం నోట్లు వెనక్కి వచ్చినట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) తెలిపింది. కేవలం రూ.10 వేల కోట్లు విలువైన నోట్లు మాత్రమే ప్రజల చేతిలో ఉన్నాయని, మిగిలినవన్నీ బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి వచ్చి చేరాయని వెల్లడించింది. మే 19న రూ.2వేల నోట్లను ఆర్‌బీఐ ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. ఆ సమయానికి రూ.3.56 లక్షల కోట్ల విలువైన నోట్లు సర్క్యులేషన్‌లో ఉండగా.. అక్టోబర్‌ 31 నాటికి ఆ సంఖ్య 10వేల కోట్లకు తగ్గిందని ఆర్‌బీఐ తెలిపింది.తొలుత బ్యాంకుల్లో మార్చుకునేందుకు, డిపాజిట్‌ చేసుకునేందుకు ప్రజలకు ఆర్‌బీఐ అవకాశం ఇచ్చింది. ఇప్పుడు ఆర్‌బీఐకి చెందిన 19 ప్రాంతీయ కార్యాలయాల్లో మాత్రమే మార్చుకునేందుకు వెసులుబాటు ఉంది. ప్రస్తుతం ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయాల వద్ద పనివేళల్లో ఇప్పటికీ పెద్ద పెద్ద క్యూలు దర్శనమిస్తున్నాయి. ఒకవేళ రూ.2వేల నోట్లు ఉంటే తపాలా శాఖ ద్వారా తమ శాఖలకు పంపించొచ్చని ఆర్‌బీఐ పేర్కొంది. ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయాలకు ప్రయాణించాల్సిన అవసరం లేకుండా ఈ సేవలను వినియోగించుకోవాలని ప్రజలకు సూచించింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z