Movies

పెళ్లి విషయంపై స్పందించిన శ్రుతి హాసన్‌

పెళ్లి విషయంపై స్పందించిన శ్రుతి హాసన్‌

ఇండస్ట్రీకి వచ్చిన కొన్నిరోజుల్లోనే మల్టీటాలెంటెడ్‌ అని నిరూపించుకున్నారు నటి శ్రుతి హాసన్‌ (Shruti Haasan). యాక్టర్‌గానే కాకుండా సింగర్‌ గానూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడిన ఆమె 30 ఏళ్లు దాటాక తన జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయన్నారు. అలాగే పెళ్లి విషయంపై స్పందించారు.

‘‘30 ఏళ్లు దాటిన అనంతరం నాలో ఎంతో ధైర్యం వచ్చింది. పూర్తిగా మారిపోయాను. దేనికైనా సమాధానం చెబుతున్నా. ఇప్పుడు మరింత ప్రశాంతంగా ఉంటున్నాను. అయితే కొందరు నా పెళ్లి గురించి ప్రస్తావిస్తూ వయసు దాటిపోయిందని అంటున్నారు. దీంతో ఒత్తిడికి గురవుతున్నా. పెళ్లెప్పుడు చేసుకుంటావంటూ ప్రశ్నిస్తున్నారు. 30 తరువాత ఇదో సమస్యగా అందరూ అడుగుతుంటారు. కానీ, నా దృష్టిలో అది సమస్యే కాదు.. అందుకే అలాంటి ప్రశ్నలను పట్టించుకోవడం మానేసి జీవితాన్ని ఆస్వాదించడం ప్రారంభించాను. 30 ఏళ్ల తర్వాత వృత్తి పరంగాను మార్పులు వస్తాయి’’ అని శ్రుతి హాసన్‌ చెప్పారు.

ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం శ్రుతి హాసన్‌ ‘సలార్’(Salaar) విడుదల కోసం ఎదురుచూస్తోంది. అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్‌ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా నటిస్తోన్న ఈ యాక్షన్‌ సినిమాపై సినీ ప్రియులు అంచనాలు పెట్టుకున్నారు. అలాగే నాని హీరోగా తెరకెక్కుతోన్న ‘హాయ్‌ నాన్న’లోనూ శ్రుతి హాసన్‌ కీలకపాత్రలో కనిపించనున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z