ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) 2023 ఎన్నికల నగారా మోగింది. కోర్టు ఆదేశాలతో ఎన్నికల నిర్వహణకు బోర్డు ఆమోదం తెలిపింది. నలుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు.
ఈ కమిటీ ఛైర్మన్‌గా ఐనంపూడి కనకంబాబు, సభ్యులుగా కోనేరు ఆంజనేయులు, ముత్యాల రాజా, కాట వెంకటేశ్వరరావు, వేములపల్లి రాఘవేంద్ర చౌదరిలు ఉన్నారు.
నవంబరు 16 నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ. జనవరి 13న కౌంటింగ్ నిర్వహించి, 14వ తేదీన ఫలితాలు విడుదల చేస్తారు. 4 బోర్డు సభ్యులకు, 29 కార్యవర్గ సభ్యులకు, 7 ఫౌండేషన్ సభ్యులకు ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
ఈ దఫా ఎన్నికలు ఎలక్ట్రానిక్ పద్ధతిలో నిర్వహిస్తున్నట్లు ప్రకటించినప్పటికీ దాని అమలు విషయంలో ఇంకా స్పష్టత రాలేదు.
వివరాలు, సభ్యత్వ నిర్ధారణ, నామినేషన్ దరఖాస్తులకు తానా ఎన్నికల వెబ్‌సైట్ సందర్శించవచ్చు – https://tana.org/elections