విక్రమ్ (Vikram) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘తంగలాన్’ (Thangalaan). పా రంజిత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో విక్రమ్ గెటప్.. గత చిత్రాలకు పూర్తి భిన్నంగా కొత్త తరహాలో ఉండనుంది. ఇటీవల ఈ సినిమాలో ఆయనకు సంబంధించిన పోస్టర్లు విడుదలై ఆసక్తిని రేకెత్తించాయి. తాజాగా ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.
👉 – Please join our whatsapp channel here –