మేషం:
ఎటువంటి ప్రయత్నం అయినా సఫలం అవుతుంది. కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్యలు పరి ష్కారం అవుతాయి. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి సహచరుల నుంచి సహాయ, సహకారాలు లభిస్తాయి. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్ల వంటి వృత్తి రంగాలవారికి డిమాండ్ పెరుగుతుంది. వారికి సమయం అన్నివిధాలా అనుకూలంగా ఉంది. వ్యాపారాల్లో ఆశించినంతగా లాభాలు పెరుగుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరు స్తాయి.
వృషభం:
వృత్తి, ఉద్యోగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలలో సంపాదన నిలకడగా కొనసాగు తుంది. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. ఒకటి రెండు శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా మారుతోంది. కోరుకున్న సంస్థ నుంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. ఆదాయంలో ఆశించిన మార్పు ఉంటుంది. ముఖ్యమైన పనులు సకాలంలో సునాయాసంగా పూర్తవుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది.
మిథునం:
వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. ఉద్యోగంలో కూడా ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారులు ప్రత్యేక బాధ్యతలను అప్పగించడం జరుగుతుంది. ఆదాయంలో ఆశించినంతగా పెరు గుదల ఉంటుంది. అయితే, ఖర్చులు తగ్గించుకుని, పొదుపు పాటించడం మంచిది. ఎవరికీ ఎటు వంటి వాగ్దానాలూ చేయకపోవడం మంచిది. కొందరు మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేసుకుంటారు. కుటుంబ జీవితం ప్రశాంతంగా, సామరస్యంగా సాగిపోతుంది. ఆరోగ్యం పరవా లేదు.
కర్కాటకం:
ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. వ్యాపారం మీద శ్రద్ధ పెంచాల్సిన అవసరం ఉంది. ఆర్థిక పరిస్థితి చాలావరకు అనుకూలంగా ఉంటుంది. అనవసర వాగ్దానాలు చేయకపోవడం మంచిది. తల్లితండ్రుల ఆరోగ్యం మీద బాగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. కుటుంబ జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.
సింహం:
ఉద్యోగంలో అధికారులు నుంచి తగిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి ఉండ వచ్చు. వృత్తి నిపుణులు ఆశించినదాని కంటే ఎక్కువగా రాణిస్తారు. మంచి ప్రాధాన్యం, గుర్తింపు సంపాదించుకుంటారు. ఆదాయం మెరుగ్గా ఉంటుంది. బంధుమిత్రులకు సహాయం చేస్తారు. తోబుట్టువులతో సఖ్యత పెరుగుతుంది. కుటుంబంలో సామరస్య వాతావరణం ఏర్పడుతుంది. విలాస జీవితం మీద బాగా ఖర్చు చేయడం జరుగుతుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశముంది.
కన్య:
ఉద్యోగ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో కూడా సంపాదన నిలకడగా ముందుకు సాగుతుంది. ఉద్యోగం మారడానికి ఇది చాలావరకు అనుకూలమైన సమయం. నిరుద్యోగులకు మంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటేమీ ఉండకపోవచ్చు. కుటుంబంతో కలిసి ఇష్టమైన ప్రాంతానికి లేదా విహార యాత్రకు వెళ్లే అవకాశం ఉంది.
తుల:
ఉద్యోగ జీవితంలో ఆశించిన సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. చిన్నపాటి అధికార యోగం పట్టే అవకాశం ఉంది. ఆదాయం పెరగడానికి సంబంధించి ఎటువంటి ప్రయత్నాలు తలపెట్టినా సఫలం అవుతాయి. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి శుభవార్త వింటారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. వాహన ప్రమాదాలతో జాగ్రత్తగా ఉండాలి. ఆహార, విహారాల్లో అప్రమత్తంగా ఉండడం మంచిది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి.
వృశ్చికం:
ముఖ్యమైన పనులు, ప్రయత్నాలు తేలికగా పూర్తవుతాయి. ఆర్థిక లావాదేవీల వల్ల ప్రయోజనం ఉంటుంది. ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. ప్రత్యేక బాధ్యతలతో క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక అవసరాలు, ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పట్టే సూచనలున్నాయి. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. సతీమణికి శుభవార్త అందుతుంది.
ధనుస్సు:
ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. ఉద్యోగంలో కొన్ని మంచి పరిణామాలు చోటు చేసు కుంటాయి. వృత్తి జీవితంలో ఉన్నవారి ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగుపడుతుంది. పెట్టు బడులు పెంచాలని లేదా వ్యాపారాన్ని విస్తరించాలని ఆలోచన చేస్తారు. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. పిల్లల నుంచి ఆశించిన శుభ వార్తలు అందుకుంటారు. సొంత పనుల మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టడం మంచిది. ఆరోగ్యం పరవా లేదు.
మకర:
ఆదాయం నిలకడగానే ఉంటుంది. అనుకోని ఖర్చులు మీద పడే అవకాశం ఉంది. కొద్దిపాటి శ్రమతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. కొన్ని ముఖ్యమైన ప్రయత్నాలు కూడా సానుకూల పడతాయి. ఉద్యోగంలో పనిభారం పెరిగే అవకాశం ఉంది. సహచరుల బాధ్యతలను పంచుకోవాల్సి వస్తుంది. వృత్తి జీవితంలో గుర్తింపుతో పాటు డిమాండ్ కూడా బాగా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారులకు సంపాదన పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
కుంభం:
ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ముందుకు సాగుతుంది. ఇతరులకు సహాయపడగల స్థితికి చేరుకునే అవకాశం ఉంది. ఉద్యోగ జీవితంలో ఆదరాభిమానాలు పెరుగుతాయి. నిర్దేశించిన లక్ష్యా లను సకాలంలో పూర్తి చేయడం జరుగుతుంది. వృత్తి వ్యాపారాలు కూడా లాభసాటిగా ముందుకు సాగుతాయి. రోజంతా ప్రశాంతంగా గడిచిపోతుంది. కుటుంబ సభ్యుల మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు. చిన్ననాటి స్నేహితులు కలుస్తారు. కొన్ని ముఖ్యమైన పనులు తేలికగా పూర్తవుతాయి.
మీనం:
ఇంటా బయటా శ్రమ, ఒత్తిడి తప్పకపోవచ్చు. ఎక్కువ పనులు మీద వేసుకోవడం మంచిది కాదు. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలు యథావిధిగా కొనసాగుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీ ఒకటి వసూలు అవుతుంది. కొందరు స్నేహితుల వల్ల డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.