సీట్ల సర్ధుబాటుపై గురువారం మధ్యాహ్నం వరకు కాంగ్రెస్ కు సీపీఎం డెడ్ లైన్ విధించింది. కాంగ్రెస్ తో పొత్తులపై ఇంకా స్పష్టత రాకపోవడంతో వామపక్షాలు ఇవాళ కీలక నిర్ణయం ప్రకటించే ఛాన్స్ ఉంది. సీట్ల కేటాయింపుపై మధ్యాహ్నం 3 గంటలలోగా స్పష్టత ఇవ్వాలని వామపక్షాలు కాంగ్రెస్‌కు డెడ్‌లైన్ విధించాయి. లేనిపక్షంలో సీపీఎం పోటీ చేసే స్థానాలను ప్రకటిస్తామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తమకు ఫోన్ చేసి పొత్తులపై క్లారిటీ ఇస్తానని చెప్పారని తమ్మినేని తెలిపారు. నవంబర్ 1న రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో భట్టి చెప్పారని తమ్మినేని తెలిపారు. నవంబర్ 1న జరిగిన సీపీఎం కార్యవర్గ సమావేశంలో కాంగ్రెస్ తో పొత్తు అంశంపైనే ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. వైరా, మిర్యాలగూడ సీట్లు కేటాయిస్తే పొత్తుకు అంగీకరించాలని సీపీఎం భావిస్తున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మరోవైపు కాంగ్రెస్‌తో సీపీఐ పొత్తు పెట్టుకుంటే ఒంటరిగానే పోటీ చేస్తామని సీపీఎం నేతలు చెబుతున్నారు. సీపీఐ అభ్యర్థులు పోటీ చేసే చోట సీపీఎం పోటీ చేయదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనం సాంబశివరావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ తుది జాబితా ప్రకటించే వరకు వేచిచూడాలని, ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. నిన్న కాంగ్రెస్ పార్టీతో పొత్తుల పరిస్థితి పై రాష్ట్ర కమిటీ లో సుదీర్ఘంగా చర్చించామని అన్నారు. మరోసారి డైడ్ లైన్ ఇచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తీరు పై తమ్మినేని స్పందించారు. ఎవరి పంచన చేరే అలవాటు వామపక్షాలకు లేదనీ… రాజకీయ ఎత్తుగడలో భాగాంగానే పొత్తులు ఉంటాయని తెలిపారు. ఏ జాబితాను చూసి భయపడం.. మా జాబితాలు మాకుంటాయంటూ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ , సీపీఎం అడిగిన సీట్లు ఇవ్వకపోవచ్చని భావిస్తున్నారు. ఒంటరి పోటీ పై నిర్ణయం తీసుకోవద్దని కాంగ్రెస్ పార్టీ నేతల సూచనతో మధ్యాహ్నం వరకు అగి, సీపీఎం నిర్ణయం వెల్లడించనుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 20 నుంచి 22 స్థానాలకు సంబంధించిన లిస్ట్ ను సీపీఎం రాష్ట్ర కమిటీ ప్రిపేర్ చేసింది. కాంగ్రెస్ తో పొత్తు చెడితే 3 గంటలకు లిస్ట్ ప్రకటించేందుకు సిద్ధంగా ఉందని తెలుస్తుంది. ఇక సీపీఐ కాంగ్రెస్ తో పొత్తు కోసం వేచి ఉండాలని నిర్ణయం తీసుకుంది. ఇవ్వాళ ఉమ్మడి వామపక్ష పార్టీల సమావేశం ఉండే అవకాశం వున్నట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ తో పొత్తు ఉన్నా లేకుండా సీపీఎం, సీపీఐ కలిసే ఎన్నికల్లో పనిచేయాలని నిర్ణయం తీసుకుంది.
మరోవైపు కాంగ్రెస్ తో పొత్తు అంశంపై సీపీఐ నారాయణ చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏం చేయాలో తేల్చుకోకుండా పొత్తులపై విమర్శలు చేస్తూ… నిచ్చితార్డం అయ్యాక యింకో అందమయిన అమ్మాయి గాని అబ్బాయిగాని దొరికితే లగేస్కుని పోవడం వ్యక్తి జీవితంలో అక్కడక్కడా జరగచ్చేమో మరి వ్యవస్థను కాపాడే తాజారాజకీయాలలో కుడా జరిగితే ఎలా? అని జరుగుతున్న రాజకీయాలను విమర్శించారు. తమతో పొత్తు, సీట్ల కేటాయింపు విషయంలో కాంగ్రెస్ క్లారిటీ ఇవ్వడం లేదని విమర్శించారు. ఇటీవల బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఆయనకు చెన్నూరు కాంగ్రెస్ సీటు కేటాయిస్తారనే ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా చెన్నూరు సీటును సీపీఐ ఇప్పటికే కోరిన సంగతి తెలిసిందే. సీపీఐ నారాయణ చేసిన ఈ ట్వీట్ కలకలం రేపుతోంది. అనే విషయంపై ఇవాళ మధ్యాహ్నం స్పష్టత వస్తుందని సమాచారం.
👉 – Please join our whatsapp channel here –