NRI-NRT

అమెరికా వీసా కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు శుభవార్త

అమెరికా వీసా కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు శుభవార్త

అమెరికా వీసాల (US Visas) కోసం చూస్తున్న భారతీయుల (Indians) కు గుడ్‌న్యూస్. యూఎస్ తాజాగా 2.5లక్షల వీసా స్లాట్స్ (Visa Slots) ఓపెన్ చేసింది. దీంతో బీ1 (బిజినెస్), బీ2 (టూరిస్ట్) వీసాల ఇంటర్వ్యూ కోసం వేచి చూసే సమయం దేశంలోని వివిధ నగరాలలో భారీగా తగ్గింది. దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో గతవారం 542 రోజులుగా ఉన్న వెయిటింగ్ టైమ్ (Waiting Time) ఇప్పుడు 37 రోజులకు తగ్గింది. అలాగే కోల్‌కతాలో కూడా ఈ సమయం భారీగానే తగ్గింది. గతవారం అక్కడ 539 రోజులుగా ఉన్న వేచి చూసే సమయం ఇప్పుడు 126 రోజులకు తగ్గింది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబై (Mumbai) లోనూ ఇదే పరిస్థితి ఉంది. గతవారం 596 రోజులుగా ఉన్న వెయిటింగ్ టైమ్ ప్రస్తుతం 322 రోజులకు దిగి వచ్చింది. అలాగే చెన్నైలో కూడా 526 రోజుల నుంచి 341 రోజులకు తగ్గింది. అయితే, హైదరాబాద్‌ (Hyderabad) లో మాత్రం ఈ సమయంలో కొంత పెరుగుదల నమోదు కావడం గమనార్హం. గతవారం 506 రోజులుగా ఉన్న వేచి చూసే సమయం ఇప్పుడు 511 రోజులకు పెరిగింది.

ఈ నేపథ్యంలో యూఎస్ ఎంబసీ (US Embassy) తన అధికారిక ‘ఎక్స్’ (ట్విటర్) లో ఒక పోస్ట్ పెట్టింది. “మా కాన్సులర్ బృందానికి ఇది బిజీగా ఉండే వారాంతం! వారాంతంలో మేము పావు మిలియన్లకు పైగా వలసేతర వీసా అపాయింట్‌మెంట్‌లను ప్రారంభించాము! https://ustraveldocs.com/in/en ద్వారా ఈ రోజే మీ అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోండి” అని అమెరికా రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది. ఇదిలాఉంటే.. ఈ ఏడాది రికార్డు స్థాయిలో భారతీయులకు సంబంధించిన 10లక్షలకు పైగా వీసా దరఖాస్తులను అగ్రరాజ్యం ప్రాసెస్ చేసింది. కరోనా కంటే ముందు భారతీయుల వీసా ప్రాసెస్ అనేది ఈ ఏడాది ఏకంగా 20 శాతం పెరగుదలను నమోదు చేసిందని ఎంబసీ అధికారులు వెల్లడించారు. ప్రత్యేకించి ఇండియన్ల వీసా ఆప్లికేషన్లను యూఎస్ త్వరితగతిన ప్రాసెస్ చేస్తుండడంతో వెయిటింగ్ టైమ్ అనేది భారీగా తగ్గింది. గతవారంతో పోలిస్తే ఇండియాలోని ప్రధాన నగరాలలో సగటున ఒకటిన్నరేళ్లు ఈ సమయం తగ్గినట్లు ఎంబసీ చెప్పుకొచ్చింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z