బ్రిటన్‌కు చెందిన ఆర్థిక సేవల సంస్థ లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూపు తాజాగా హైదరాబాద్‌లో లాయిడ్స్ టెక్నాలజీ సెంటర్(ఎల్‌టీసీ)ని ప్రారంభించింది. రాయదుర్గంలోని నాలెడ్జ్ సిటీలో ప్రారంభించిన ఈ కార్యాలయం కోసం ఈ ఏడాది చివరినాటికి సంస్థ 600 మంది టెకీలను నియమించుకోనున్నది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ వినియోగదారులకు టెక్నాలజీ ఆధారిత సేవలను అందించేందుకు హైదరాబాద్‌ను గ్లోబల్ సెంటర్‌గా ఎంపిక చేసుకున్నట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
ఇప్పటి వరకు భారత్‌లో భారీగా పెట్టుబడులు పెట్టిన సంస్థ..వచ్చే మూడేండ్ల కాలంలో మరో 3 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టాలని యోచిస్తున్నది. ఈ నిధులతో డిజిటల్ రంగాన్ని మరింత బలోపేతం చేయడంతోపాటు కృత్రిమ మేధస్సు, క్లౌడ్, బ్లాక్‌చెయిన్ ప్రొగ్రాంలను అందించనున్నది. బ్రిటన్‌లో ఉన్న కస్టమర్లకు డాటా, మెచిన్ లెర్నింగ్, క్లౌడ్ ఆధారంగా సేవలు అందించడానికి ఈ నూతన ఆఫీస్‌ను వినియోగించుకోనున్నట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
👉 – Please join our whatsapp channel here –