ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి తెలంగాణలో పర్యటించబోతున్నారు. నవంబర్ 7వ తేదీన బీసీ ఆత్మగౌరవ సభకు, 11వ తేదీన పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే మాదిగ, ఉపకులాల విశ్వరూప మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు తక్షణమే చట్టబద్ధత కల్పించాలని కోరుతూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఛలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలునిచ్చారు.ఎన్నికల వేళ మూడు రోజుల వ్యవధిలో ప్రధాని రెండు సార్లు తెలంగాణకు రాబోతుండటం ఆసక్తిగా మారింది. గత నెలలో నిజామాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని కేసీఆర్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయేలో చేరుతామని గతంలో సీఎం కేసీఆర్ మా వెంట పడ్డారని, కేటీఆర్కు సీఎం బాధ్యతలు అప్పగిస్తానని మీరు ఆశీర్వాదించాలని కోరినట్లు మోడీ చెప్పారు. ఈ వ్యాఖ్యలపై కేసీఆర్ ఇప్పటి వరకు రియాక్ట్ కాలేదు. ఎన్నికల వేళ ఈసారి పర్యటనలో మోడీ మరోసారి కేసీఆర్ను ఎటాక్ చేస్తారా లేక హామీల వరకే పరిమితం అవుతారా అనేది ఆసక్తిగా మారింది.
👉 – Please join our whatsapp channel here –