చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం సాధించిన సినిమాల్లో ‘కాంతార’ ఒకటి ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ముందుగా కన్నడ భాషలో విడుదలైన ఈ సినిమా అక్కడ సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఆతర్వాత ఇతర భాషల్లోకి రిలీజ్ అయ్యింది. విడుదలైన అన్ని భాషల్లో కాంతార సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా ఓ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. కాంతార సినిమాలో వరహా రూపం సినిమా పై అప్పట్లో వివాదం రేగింది. ‘ సినిమాలోని ‘వరాహ రూపం’ పాట పై కాపీరైట్ ఇష్యు వచ్చింది. ‘వరాహ రూపం’ పాట తైక్కుడం బ్రిడ్జ్‌లోని ‘నవసరం’ పాటకు కాపీ అని పాట హక్కులను కలిగి ఉన్న మాతృభూమి పబ్లిషర్స్ దావా వేశారు.
తొలుత దిగువ కోర్టులో విచారణ జరిపి ‘వరాహ రూపం’ పాటను ఓటీటీ కాకుండా థియేటర్లలో లేదా డిజిటల్ మీడియాలో ఉపయోగించరాదని ఆదేశించింది. ఈ కేసు కేరళ హైకోర్టుకు చేరడంతో కాంతార చిత్ర బృందానికి కాస్త ఊరట లభించింది. అయితే ఆ తర్వాత మళ్లీ చిత్ర యూనిట్ పై తాత్కాలిక ఉత్తర్వులు వెలువడ్డాయి.
ప్రస్తుతం ‘కాంతార’ చిత్ర బృందం తరఫున వాదిస్తున్న విజయ్ వి పాల్.. కాంతార చిత్ర బృందం, మాతృభూమి పబ్లిషర్స్ మధ్య జరిగిన చర్చల అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లి క్రిమినల్ ప్రొసీడింగ్‌ను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. కేరళ హైకోర్టు ఈ పిటిషన్‌ను అంగీకరించింది అలాగే సెక్షన్ 482 CrPC కింద ప్రత్యేక అధికారాలను ఉపయోగించి కేసును రద్దు చేసింది. ఈ వివాదం రెండు సంస్థల మధ్య ప్రైవేట్ వివాదంగా కనిపిస్తోందని గతంలో ఇలాంటి కొన్ని కేసులను పేర్కొంటూ కేరళ హైకోర్టు కేసును రద్దు చేసింది.
తైక్కుడం బ్రిడ్జ్ అనే కేరళ మ్యూజిక్ బ్యాండ్ ఆరేళ్ల క్రితం నవసరం పేరుతో ఆల్బమ్‌ను విడుదల చేసింది. ఇందులోని ప్రధాన పాట నవరసం దాదాపు ‘కాంతార’ చిత్రంలోని ‘వరాహ రూపం’ పాట మ్యూజిక్ నుపోలి ఉంటుంది. ‘వరాహ రూపం’ పాట సూపర్ హిట్ అవ్వడంతో నవరసం పాట హక్కులను సొంతం చేసుకున్న తైక్కుడం బ్రిడ్జ్, మాతృభూమి పబ్లికేషన్స్ సంస్థలు దావా వేసాయి. కోర్టు ఆదేశాల మేరకు సినిమా నుంచి ‘వరాహ రూపం’ పాటను తొలగించారు. ఆ తర్వాత తాత్కాలికంగా నిషేధం తొలగించి మళ్లీ పాటకు అనుమతి ఇచ్చారు. ప్రస్తుతం చర్చల ద్వారా వివాదం సద్దుమణిగింది. ‘కాంతారావు’ చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ సంగీత దర్శకత్వం వహించారు. హోంబలే ఫిల్మ్స్‌కు చెందిన విజయ్ కిర్గందూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వచ్చిన విషయం తెలిసిందే.
👉 – Please join our whatsapp channel here –