తెలుగు అసోసియేషన్ అఫ్ మెట్రో అట్లాంటా(తామా) అగస్టా ఫ్లైట్ స్కూల్ సౌజన్యంతో అక్టోబర్ 28, 29న స్థానిక చెరోకీ కౌంటీ ఎయిర్ పోర్ట్ లో “డిస్కవరీ ఫ్లైట్” కార్యక్రమం నిర్వహించారు. “ఫ్లైట్ సర్టిఫైడ్ ఇన్స్ట్రక్టర్” ఆధ్వర్యంలో ఒక గంట పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రవాస యువతీయువకులకు విమానాన్ని నడపడంపై శిక్షణనిచ్చారు. అగస్టా ఫ్లైట్ స్కూల్ సమతాశెట్టి-నందిశెట్టి, అఖిల్ పర్యవేక్షణ్లో 10-20 ఏళ్ల మధ్య ప్రవాసులు ఈ కార్యక్రమంలో హుషారుగా పాల్గొన్నారు. సముద్రపు మట్టం నుండి 4వేల అడుగుల ఎత్తులో సెస్నా 172 ఫ్లైట్ ద్వారా ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. తామా అధ్యక్షుడు సాయిరామ్ కారుమంచి, టెక్నాలజీ కార్యదర్శి సునీల్ దేవరపల్లి, కమ్యూనిటీ కార్యదర్శి సత్య గుత్తులలు కార్యక్రమ విజయవంతానికి సాయపడిన వారికి ధన్యవాదాలు తెలిపారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z