కులగణన చేపట్టాలనే నిర్ణయానికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. 92 ఏళ్ల తర్వాత కులాలవారీగా లెక్కలు తీస్తున్నట్లు భేటీ తర్వాత మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు. ఈ మేరకు మంత్రివర్గ నిర్ణయాలను ఆయన మీడియాకు వెల్లడించారు.
మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలివే..
* నవంబర్‌లో సంక్షేమ క్యాలెండర్ అమలుకు ఆమోదం.
* రైతు భరోసా ఆర్థిక సాయం పంపిణీకి ఆమోదం.
* అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కుల కల్పన.
* పౌరసరఫరాల కార్పొరేషన్ రుణం తీసుకునేందుకు అనుమతి.
* ధాన్యం సేకరణ కోసం రూ.5వేల కోట్ల రుణం తీసుకునేందుకు ఆమోదం.
* పరిశ్రమల ఏర్పాటుకు ఎస్‌ఐబీలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం.
* 467 అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకానికి ఆమోదం.
* రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల భర్తీకి అనుమతి.
* తూ.గో, సత్యసాయి జిల్లాల్లో రవాణాశాఖ యూనిట్ల ఏర్పాటుకు ఆమోదం.
* ప్రతి ఒక్కరూ ఆరోగ్యశ్రీ యాప్ డౌన్‌లోడ్ చేసుకునేలా నిర్ణయం.
* ప్రభుత్వ హైస్కూళ్లలో సాంకేతిక నైపుణ్యం కోసం ఇంజినీరింగ్ కళాశాలలతో మ్యాపింగ్.
* విద్యుత్ బస్సులు, ట్రక్కుల తయారీ సంస్థ పెప్పర్ మోషన్ సంస్థకు చిత్తూరు జిల్లాలో భూకేటాయింపు.
* గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏర్పాటుకు ఎన్టీపీసీకి అనుమతి.
* క్రీడాకారుడు సాకేత్ మైనేనికి గ్రూప్-1 ఉద్యోగం ఇచ్చేందుకు అనుమతి.
* ఫెర్రో అల్లాయ్స్ పరిశ్రమలకు విద్యుత్ డ్యూటీ 6 పైసలకు తగ్గిస్తూ నిర్ణయం.
👉 – Please join our whatsapp channel here –