తెదేపా అధినేత చంద్రబాబు నేడు డిశ్చార్జి కానున్నారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) ఆస్పత్రి వైద్యులు ఆయన్ను డిశ్చార్జి చేయనున్నారు. ఏఐజీ నుంచి ఆయన నేరుగా జూబ్లీహిల్స్‌లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి వెళ్లే అవకాశముంది. అక్కడే క్యాటరాక్టు సమస్యకు వైద్యులు చంద్రబాబుకు శస్త్రచికిత్స చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
వైద్య పరీక్షల కోసం గురువారం ఏఐజీ ఆస్పత్రిలో చంద్రబాబు చేరారు. ఏఐజీకి చెందిన గ్యాస్ట్రోఎంటరాలజీ నిపుణులు డాక్టర్ కె.రాజేష్ ఆధ్వర్యంలో జనరల్ మెడిసిన్‌తోపాటు కార్డియాలజీ, పల్మనాలజీ, డెర్మటాలజీ విభాగాలకు చెందిన వైద్య నిపుణుల బృందం ఆయనకు వివిధ వైద్య పరీక్షలు సూచించినట్లు సమాచారం. రక్త, మూత్ర పరీక్షలు, ఈసీజీ, 2డీ ఎకో, కాలేయ, మూత్రపిండాల పనితీరు, అలర్జీ స్క్రీనింగ్ ఇతర టెస్టులు చేసినట్లు తెలుస్తోంది. జైలులో ఉన్న ఆయనకు తీవ్ర అలర్జీ, ఇతర అనారోగ్య కారణాల రీత్యా మధ్యంతర బెయిల్ లభించడంతో బుధవారం హైదరాబాద్ చేరుకున్న విషయం తెలిసిందే.
👉 – Please join our whatsapp channel here –