సువిశాల గోదావరి అంతమయ్యే అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి నుండి అరేబియా సముద్ర తీరంలోని ఆకాశహర్మ్యాల అనుభూతుల నగరమైన దుబాయికు వచ్చి అమె ఆనందోత్సవాల మధ్య గడుపుతూ అన్ని అనుభవిస్తున్నా… అధ్యాత్మిక చింతన కల్గిన అమె అందరితో పాటు ప్రార్ధన చేయాలనే కోరిక మాత్రం నెరవెర్చడంలో జాప్యం జరుగుతుండడంతో మధనపడుతున్న నేపథ్యంలో తెలుగు మందిరం గూర్చి తెలుసుకొన్న ఆ ఆడపడుచు అనేక మంది తెలుగు కుటుంబాల మధ్య తన ప్రభువును స్మరించుకొని ప్రార్ధించడంతో సంతోషానికి హద్దులు లేకుండాపోయాయి.
దుబాయికు వచ్చిన సఖినేటిపల్లి మండలానికి చెందిన అన్నామణి కిరణ్‌కు ప్రప్రథమంగా తెలుగు చర్చిలోని అనుభవం ఇది. మాతృభూమికు దూరంగా ఒంటరిగా ఉన్నా ఆత్మీయుల తెలుగుతనంతో ప్రభువు సన్నిధిలో గడిపిన అమె సంతోషం వర్ణణాతీతం. ఈ రకంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన కొన్ని వందలాది మంది క్రైస్తవులకు దుబాయిలోని సి.యస్.ఐ తెలుగు చర్చి గత ఏడు సంవత్సరాలుగా ఆధ్యాత్మిక సేవలందిస్తోంది.ఇటీవల ఏడవ వార్షికోత్సవాన్ని పూర్తిగా అధ్యాత్మిక వాతవారణంలో యేసయ్యకు అంకితం ప్రభూ నా జీవితం అంటూ యేసు నామ స్మరణతో భక్తులు పరవశించిపోయారు. విజయవాడ నుండి ప్రత్యేకంగా వచ్చిన హోసన్నా చర్చి పాస్టర్ రాజా చేసిన వ్యాక్యాన్ని అందరు భక్తిగా అలికించారు. ముఖ్య అతిథిగా సిస్టర్ అనిత అశ్వీరాదం కూడ ఆంధ్ర ప్రదేశ్ నుండి వచ్చారు. దుబాయిలోని యునైటెడ్ తెలుగు పాస్టర్స్ అసోసియెషన్ అధ్యక్షులు పాస్టర్ పాలపర్తి సురేశ్ బాబు మరియు ఇతర పాస్టర్లు కూడా అతిథులుగా పాల్గొన్నారు. మహిళలు, యువకులు అన్నీ తామై కార్యక్రమాన్ని నిర్వహించారు. సంఘం పెద్దలు సేమ్ ఎజ్కేల్, కె. బాబు, శ్యాముల్, శ్రావణి దీపక్ తదితరులు వివిధ కార్యక్రమాలను సమన్వయం చేసారు.దుబాయిలోని హోలి చర్చి ప్రాంగణంలో కల్గిన ఈ తెలుగు చర్చి పాస్టర్లు బాబ్జీ స్టీఫెన్ డేనియల్, రత్నంల అధ్వర్యంలో ప్రవాసీ క్రైస్తవులకు సేవలందిస్తోంది.
👉 – Please join our whatsapp channel here –