సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా? అని ఎదురు చూస్తున్న క్రేజీ మూవీకి సంబంధించిన అప్‌డేట్ వచ్చేసింది. కమల్‌హాసన్ (Kamal Haasan) కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఫిల్మ్ ‘భారతీయుడు-2’కు (Bharateeyudu 2) సంబంధించిన స్పెషల్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి తెలుగు వీడియోను అభిమానులతో పంచుకున్నారు. కమల్-శంకర్ కాంబోలో వచ్చిన ‘భారతీయుడు’ ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. దాదాపు 25ఏళ్ల తర్వాత ఇప్పుడు వీరిద్దరూ ‘భారతీయుడు-2’ (Indian 2)తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
👉 – Please join our whatsapp channel here –