* సైబర్ క్రిమినల్స్ ఉచ్చులో ప్రొబేషనరీ ఐపీఎస్
ఓ ప్రొబెషనరీ ఐపీఎస్ అధికారి సైబర్ నేరగాళ్ల వలలో పడ్డారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వాట్సప్ వీడియో కాల్ రావడంతో సదరు అధికారి ఎత్తారు. ఓ మహిళ నగ్నంగా దర్శనమివ్వడంతో వెంటనే కట్ చేశారు. కానీ ఈలోపే ఆ కాల్‌ను రికార్డు చేసి, డబ్బులివ్వకపోతే సామాజిక మాధ్యమాల్లో పెడతామంటూ బెదిరింపులకు దిగడంతో.. సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు ప్రొబెషనరీ ఐపీఎస్ అధికారి ప్రస్తుతం జాతీయ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్నారు.
* రక్తపుమడుగులో ఫిల్మ్‌మేకర్
సభ్య సమాజం తలదించుకునే ఘటన ఢిల్లీలో జరిగింది. ఓ ద్విచక్ర వాహనదారుడు ప్రమాదానికి గురై రోడ్డుపై రక్తపు మడుగులో పడి ఉన్నాడు. చుట్టూ ఉన్న జనం అతడిని ఆసుపత్రికి తరలించడమో, పోలీసులకు సమాచారం అందించడమో చేయకుండా చోద్యం చూస్తూ వీడియోలు తీశారు. అంతటితో ఆగలేదు. అతడి ‘గోప్రో’ను చోరీ చేసి తీసుకెళ్లిపోయారు. సౌత్ ఢిల్లీలో జరిగిందీ ఘటన. బాధితుడిని డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ పీయూష్ పాల్‌గా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన పీయూష్.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అక్టోబరు 28న రాత్రి 10 గంటల సమయంలో జరిగిందీ ఘటన. ఘటనా స్థలంలో ఉన్న సీసీటీవీ కెమెరాలో ఈ యాక్సిడెంట్ రికార్డైంది. పంచశీల్ ఎన్‌క్లేవ్ సమీపంలో పీయూష్ బైక్ పై వెళ్తుండగా వెనక నుంచి వచ్చిన మరో బైక్ ఢీకొట్టింది. దీంతో పీయూష్ అల్లంత దూరం ఎగిరిపడ్డాడు. గురుగ్రామ్‌లో ఫ్రీలాన్స్ ఫిల్మ్ మేకర్‌గా పీయూష్ పనిచేస్తున్నాడు. ప్రమాదం జరిగిన వెంటనే చుట్టుపక్కలవారు స్పందించి ఉంటే ఆయన బతికి ఉండేవాడని పీయూష్ స్నేహితుడు తెలిపారు. రక్తమోడుతూ రోడ్డుపై విలవిల్లాడుతున్న పీయూష్ చుట్టూ మూగిన జనం ఫొటోలు, వీడియోలు తీయడంలో మునిగిపోయారని ఆవేదన వ్యక్తంచేశాడు. దాదాపు 20 నిమిషాలపాటు పీయూష్ అలాగే రోడ్డుపై పడి వున్నాడని, ఆయన శరీరంలోని రక్తం మొత్తం పోయిందని అన్నారు.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా వెనక నుంచి వచ్చి పీయూష్‌ను బైక్ ను ఢీకొట్టిన బైకర్‌ను బంటీగా గుర్తించారు పోలీసులు. ఈ విషయంలో సీసీటీవీ ఫుటేజ్ వారికి ఉపయోగపడింది. అందుకే ర్యాష్ డ్రైవింగ్ కింద బంటీపై పోలీసులు కేసు నమోదు చేశారు.
* పుట్టింటికెళ్లిన భార్య తిరిగిరాలేదని బలవన్మరణానికి పాల్పడిన భర్త
కర్వాచౌత్ నాడు పుట్టింటికి వెళ్లిన తన భార్య తిరిగి రాలేదన్న కారణంతో ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌రాష్ట్రం బరేలీ లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..భుటా పోలీసు స్టేషన్ పరిధి లోని గుగా గ్రామానికి చెందిన ప్రమోద్ కుమార్ భార్య ప్రీతి రెండు నెలల క్రితం తన పుట్టింటికి వెళ్లింది. అయితే, బుధవారం కర్వాచౌత్ సందర్భంగా ఇంటికి రావాలని భార్యను కోరాడు. ఈ విషయంపై తన అత్తగారితో వాగ్వాదానికి దిగాడు. అయితే, ప్రమోద్ భార్య మాత్రం ఇంటికి రాలేదు. దీంతో మనస్తాపం చెందిన అతడు.. ఇంట్లోని తన గదిలో బుధవారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం ప్రమోద్ ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు గది తలుపులు పగులగొట్టి చూడగా ఉరేసుకొని కనిపించాడు. ఈ మేరకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.బుధవారం దేశవ్యాప్తంగా మహిళలు కర్వాచౌత్ వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు. జీవిత భాగస్వామి క్షేమాన్ని కోరుతూ మహిళలు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకూ ఉపవాసం ఉండి.. అమ్మవారికి పూజలు నిర్వహించి చంద్రుడి దర్శనం చేసుకుంటారు. జల్లెడలో ముందుగా చంద్రుడిని చూసి ఆ తర్వాత భర్త ముఖాన్ని చూస్తారు. భర్త ఆశీర్వాదాల అనంతరం ఉపవాస దీక్షను విరమిస్తారు. కుటుంబసభ్యులు, సన్నిహితులతో కలిసి విందులో పాల్గొంటారు.
* తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో ఉక్కుపాదం
వరుసగా డ్రగ్ పెడ్లర్లను కటాకటాల వెనక్కి పంపిస్తున్న తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులు తాజాగా కల్లు కాంపౌండ్లపై దృష్టి సారించారు. హైదరాబాద్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న కల్లు కాంపౌండ్లపై ఏక కాలంలో దాడులు చేశారు. ఆల్ఫాజోలేం ఉపయోగిస్తూ కృత్రిమ కల్లు తయారు చేసి అమ్ముతున్నట్టు నిర్ధారించుకొని 69 కాంపౌండ్లను సీజ్ చేశారు. వీటి నుంచి శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపించారు. నివేదికలు అందిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు.
* మన్యం జిల్లాలో దారుణం
సినీ రంగం పైన ఆసక్తి ఉండడం తప్పు కాదు. కానీ ఇష్టం ఉన్న పనిని ప్రారంభించాలి ఒక్కసారిగా నేమ్ ఫేమ్ సంపాదించాలి అనుకుని ఓ ప్లాన్ లేకుండా అప్పులు చేస్తేనే ముప్పు. ఇలా సినీ రంగం పైన అవగాహనా లేకుండా అప్పులు తెచ్చి సినిమాలు తీసి నష్టపోయిన వాళ్ళు గతంలో కోకొల్లలు. అయితే ఇప్పుడు ఆకోవలోకి షార్ట్ ఫిల్మ్ ప్రొడ్యూసర్లు కూడా వస్తున్నారు. షార్ట్ ఫిలిమ్స్ పైన ఓ యువకుడికి ఉన్న ఆసక్తి అతని ప్రాణాలను బలితీసుకుంది. ఈ ఘటన మన్యం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మన్యం జిల్లా లోని పార్వతీపురం లోని మణికంఠ కాలనీకి చెందిన దుప్పలపూడి సునీల్ అనే యువకుడు సినిమాలపైన ఉన్న ఇష్టంతో.. షార్ట్ ఫిలిమ్స్ తీస్తే ఏదో రోజు సినిమా అవకాశం వస్తుందనే ఆశతో.. సొంత బంధువులు, స్నేహితులు దగ్గర అప్పులు చేసి షార్ట్ ఫిల్మ్ లు తీసాడు.అయితే ఆ షార్ట్ ఫిలిమ్స్ నుండి తనకు లాభం రాకపోగా నష్టాల పాలయ్యాడు. యువకుడి తల్లి సరస్వతీ మెప్మాలో ఆర్పీగా పనిచేస్తున్నారు. కాగా ఆమె జీతం డబ్బులు కూడా షార్ట్ ఫిలిమ్స్ తీసేందుకు వినియోగించాడు. ఈ క్రమంలో ఆర్ధికంగా బాగా దెబ్బతిన్నాడు సునీల్. ఈ నేపథ్యంలో అప్పులు తీర్చలేక ఇబ్బందులు పడుతున్న సునీల్ ఆర్ధిక ఇబ్బందులు పెరగడంతో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చేతికి అందిన కొడుకు మరణంతో సునీల్ తల్లి గుండెలవిసేలా విలపిస్తోంది. కాగా సునీల్ తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సునీల్ మృతదేహాన్నిపోస్టుమార్టం నిమిత్తం కేంద్ర ఆసుపత్రికి తరలించారు
* ఏడంతస్థు నుంచి దూకి యువతి ఆత్మహత్య
నేటి యువత సమస్యలను ధైర్యంగా ఎదుర్కొలేకపోతున్నారు. చిన్న చిన్న సమస్యలను కూడా ఎదుర్కొలేకపోతున్నారు. అసలూ ముందు వెనుక ఆలోచించకుండా.. ఆఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. తాజాగా ఓ యువతి క్షణికావేశంలో అనాలోచిత నిర్ణయం తీసుకుంది. తల్లిదండ్రులు తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని, తనకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని తల్లిదండ్రులకు , బంధువులకు చెప్పినా తన మాట వినకపోవడంతో మనస్థాపానికి గురైంది. ఇక ఇష్టం లేని పెళ్లి చేసుకుని జీవితాంతం బాధపడే బదులు ప్రాణాలు వీడువాలని నిర్ణయించుకుంది. ఆత్మహత్యే శరణ్యం అని భావించింది. అంతే ఏడంతస్థుల భవనం నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన శుక్రవారం సత్యసాయి జిల్లాలో జరిగింది. వివరాల్లోకెళ్తే.. ఏపీ లోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి గోకులంలోని సాయి శ్రీనివాస అపార్ట్మెంట్ లో గౌరీ అనే యువతి కుటుంబంతో నివాసం ఉంటుంది. డిగ్రీ చదువుతున్న గౌరీకి ఇంట్లో పెళ్లి చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో పెళ్ళి చూపులు ఏర్పాటు చేశారు. తనకు ఇష్టం లేని పెండ్లి చేయాలని కుటుంబీకులు ప్రయత్నిస్తున్నారని ఆవేదన చేసింది. ఆమె ఎంత చెప్పిన ఒప్పుకోకపోవడం. కచ్చితంగా పెళ్లి చేసుకోవాలని ఇంట్లో వారు ఆదేశించడంతో.. ఇక పెండ్లి చూపులు జరగడంతో ఎలాగైనా తనకు పెండ్లి చేస్తారని భావించిన ఆ యువతి శుక్రవారం తెల్లవారు జామును ఏడంతస్తుల భవనంపై నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది. తీవ్రగాయాల పాలైన ఆ యువతిని వెంటనే స్థానిక హాస్పిటల్ కు తరలించారు. కానీ, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. యువతి రూంలో సూసైడ్ నోట్ లభ్యమైనట్టు తెలుస్తోంది. ఆ యువతి అపార్ట్మెంట్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ద్రుశ్యాలు సీసీ టీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేపట్టారు.
* పోలీసులపై అధికార పార్టీ నేత దాడి
నిందితులను పట్టుకోవడానికి వెళ్లిన పోలీసులపై అధికార పార్టీకి చెందిన నేత దాడిచేశాడు. ఏకంగా ఓ కానిస్టేబుల్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించడానికి ప్రయత్నించిన ఘటన బీహార్‌లోని సహర్సాలో జరిగింది. పట్టణంలో పోలీసులు బుధవారం రాత్రి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో పలువురు యువకులు తనిఖీలను తప్పించుకుని రోడ్డుపై ఏర్పాటుచేసిన బారికేడ్లను ధ్వంసం చేసి అక్కడినుంచి పరారయ్యారు. వారికోసం గాలిస్తున్న పోలీసులకు.. అధికార పార్టీ జేడీయూకి చెందిన చున్నా ముఖియా నివాసంలో దాక్కున్నారని సమాచారం అందింది.దీంతో ఆ యువకులను అరెస్టు చేయడానికి ముఖియా ఇంటికి పోలీసులు వెళ్లారు. అయితే అడ్డుకున్న ముఖియా, అతని అనుచరులు వారిపై దాడికి దిగారు. అంతటితో ఆగకుండా సమీపంలో పెట్రోల్ బంక్‌కు వెళ్లిన ముఖియా.. ఓ బకెట్ నిండా పెట్రోల్ తీసుకొచ్చారు. దానిని పోలీసు బృందంలోని ఓ మహిళా కానిస్టేబుల్‌పై పోశాడు. అనంతరం అగ్గిపెట్టె తెచ్చి కానిస్టేబుల్‌ను అంటించాలని తన భార్యతో చెప్పాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ముఖియాతోపాటు అతని అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తుకు ఆటంకం కలిగించారని కేసునమోదుచేశారు. కాగా, ఆ సమయంలో మఖియా మద్యం మత్తులో ఉన్నారని పోలీసులు తెలిపారు.
👉 – Please join our whatsapp channel here –