Politics

సీబీఐకి సుప్రీం నోటీసులు

సీబీఐకి సుప్రీం నోటీసులు

ఏపీ సీఎం జగన్‌ అక్రమాస్తుల కేసులపై వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సీబీఐకి నోటీసు జారీ చేసిన సుప్రీం.. కేసుల్లో విచారణ ఎందుకు ఆలస్యమవుతుందో చెప్పాలని ప్రశ్నించింది. రఘురామ వేసిన కేసుల బదిలీ పిటిషన్‌ను ఎందుకు విచారించకూడదో చెప్పాలని ఆదేశించింది. ప్రతివాదులకు నోటీసులు జారీచేసిన సుప్రీంకోర్టు.. తదుపరి విచారణను జనవరికి వాయిదా వేసింది.పదేళ్లుగా నత్తనడకన సాగుతున్న అక్రమాస్తుల కేసుల విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ ఇటీవల రఘురామ పిటిషన్‌ దాఖలు చేశారు. ‘‘సీబీఐ నమోదు చేసిన 11 కేసులు ఇప్పటివరకు 3,041 సార్లు వాయిదా పడ్డాయి. వీటి విచారణ త్వరగా జరిపి నిందితులను శిక్షించాలన్న ఉద్దేశం సీబీఐలో కనిపించట్లేదు. ఇందులో ప్రధాన నిందితుడిగా ఉన్న జగన్‌కు ఇష్టానుసారం వాయిదాలు కోరే స్వేచ్ఛనిచ్చారు. దీనివల్ల ఈ కేసుల విచారణకు అంతు లేకుండా పోతోంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తుంటే కేసుల విచారణ ప్రారంభమయ్యే పరిస్థితే కనిపించట్లేదు. అందువల్ల సర్వోన్నత న్యాయస్థానం జోక్యం చేసుకుని వీటి విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలి’’ అని రఘురామ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z