హసనాంబా దేవి ఆలయం…హసన్-కర్ణాటక..!!
🌸ఆ దీపం కొండెక్కదు…- నైవేద్యం పాడవదు ! మిగిలిన రోజుల్లో ఎంతో నిశ్శబ్దంగా ఉండే ఈ గుడి తలుపులు ఏడాదిలో పది నుంచి పన్నెండు రోజులు మాత్రమే తెరచుకుంటాయి. ఆ కొద్ది సమయంలోనే
అమ్మవారి చల్లని చిరునవ్వు తమపైన పడాలనే ఉద్దేశంతో భక్తులు ఎక్కడెక్కడి
నుంచో ఇక్కడకు వస్తారు.
🌸అదొక్కటే కాదు మరికొన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ
ఆలయం కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఉంది.
మూడు రాళ్ల రూపంలో కొలువైన హసనాంబాదేవి అంటే… చిరునవ్వులు చిందిస్తూ, తమ కష్టాలను పోగొట్టే దేవతగా భక్తులు భావిస్తారు.
అమ్మ ఇక్కడ ఉండటం వల్లే జిల్లాకు కూడా హసన్ అనే పేరు వచ్చిందని అంటారు. ఈ ఆలయం తెరిచిన పది
లేదా పన్నెండు రోజులు అయ్యాక గర్భగుడిలో పూలూ, నేతితో పెట్టిన దీపం, నైవేద్యాన్ని అమ్మకు సమర్పించి ఆ తరువాత తలుపులు మూస్తారు.
🌸ఏడాది తరువాత మళ్లీ తలుపులు తెరిచేనాటికి కూడా ఆ దీపం కొండెక్కకుండా అలాగే ఉంటుందట. అదే విధంగా పూలు కూడా మొదటిరోజు ఉంచినట్లుగానే తాజాగా కనిపించడం, నైవేద్యం కూడా ఏ మాత్రం పాడవ్వకుండా ఉండటం ఈ ఆలయం ప్రత్యేకత అని చెబుతారు.
ఈ గుడిని 12 వ శతాబ్దంలో కట్టారని చరిత్ర చెబుతున్నా ఎవరు నిర్మించారనే దాఖలాలు మాత్రం లేవు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z