ఒక్కరోజు రాత్రి నిద్రపోకపోవడం వల్ల మనిషి డిప్రెషన్ నుంచి బయటపడగలడని తాజా అధ్యయనం గుర్తించింది. నైట్ అవుట్ యాంటీ డిప్రెసెంట్‌గా పని చేస్తుందని, డిప్రెషన్‌కు ట్యాబ్లెట్స్ తీసుకుని సైడ్ ఎఫెక్ట్స్ పొందే బదులు రాత్రి పడుకోకుండా ఉండటం బెటర్ అని సూచిస్తుంది. నిద్రలేమి డోపమైన్ విడుదలను పెంచుతుందని.. ఇది ‘లవ్ డ్రగ్’గా పని చేసి, మెదడు కనెక్షన్‌లను తిరిగి మారుస్తుందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ నైట్ అవుట్ వల్ల శరీరం అలసిపోవచ్చు కానీ మనసు మాత్రం హ్యాపీగా ఉంటుందని.. డిప్రెషన్ నుంచి బయటపడుతుందని తెలిపారు.నార్త్‌వెస్టర్న్ యూనివర్శిటీలోని న్యూరోబయాలజిస్టులు ఈ పంచ్-డ్రంక్ మెకానిజమ్ వెనుక ఉన్న మెకానిజమ్ గురించి వివరించారు. ఎలుకలలో తేలికపాటి, తీవ్రమైన నిద్ర లేమిని ప్రేరేపించడం.. ఆ సమయంలో వాటి ప్రవర్తన, మెదడు కార్యకలాపాలను విశ్లేషించడం ద్వారా డోపమైన్ విడుదలలో పెరుగుదల, మూడ్‌ను ఎలివేట్ చేసే బ్రెయిన్ రీవైరింగ్ మార్గం సినాప్టిక్ ప్లాస్టిసిటీ పెరగడాన్ని గుర్తించారు.
మొత్తానికి ఒక్క రాత్రి నిద్రకోల్పోవడం.. శక్తివంతమైన యాంటీడిప్రెసెంట్ ప్రభావాన్ని ప్రేరేపిస్తుందని, మెదడును తిరిగి మారుస్తుందని కనుగొన్నట్లు నిర్ధారించిన శాస్త్రవేత్తలు.. డోపమైన్ విడుదలకు కారణమైన నాలుగు మెదడు ప్రాంతాలపై దృష్టి సారించినట్లు తెలిపారు. తీవ్రమైన నిద్ర నష్టం తర్వాత ప్రిఫ్రంటల్ కార్టెక్స్, న్యూక్లియస్ అక్యుంబెన్స్, హైపోథాలమస్, డోర్సల్ స్ట్రియాటం ప్రాంతాలపై కాన్సంట్రేట్ చేసిన సైంటిస్టులు.. మధ్యస్థ ప్రిఫ్రంటల్ కార్టెక్స్‌లోని డోపమైన్ ఇన్‌పుట్స్ సైలెంట్ చేయబడినప్పుడు మాత్రమే యాంటిడిప్రెసెంట్ ప్రభావం అదృశ్యమవుతుందని గుర్తించారు. దీన్ని బేస్ చేసుకుని మెడిసిన్ డెవలప్మెంట్‌లో మార్పులు తీసుకురాగలమని చెప్తున్నారు.
👉 – Please join our whatsapp channel here –