Politics

మీ అంద‌ర్నీ ప్రార్థించేది ఒక్క‌టే

మీ అంద‌ర్నీ ప్రార్థించేది ఒక్క‌టే

నాకు అంకాపూర్ అంటే ప్రాణంతో స‌మానం.. బ‌హుషా ఈ ప్ర‌పంచంలో అంకాపూర్ గురించి నేను చేసినంత ప్ర‌చారం ఎవ‌రూ చేయ‌లేదు అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఆర్మూర్ నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు.ఎన్నిక‌లు వ‌స్తాయి పోతాయి.. పార్టీకి ఒక‌రు నిల‌బ‌డుతారు. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ బ‌రిలో ఉంద‌ని కేసీఆర్ పేర్కొన్నారు. మీ అంద‌ర్నీ ప్రార్థించేది ఒక్క‌టే. ఇక్క‌డ రైతాంగం అధికంగా ఉంట‌ది. పంట‌లు బ్ర‌హ్మాండంగా పండిస్తారు. నాకు అంకాపూర్ అంటే ప్రాణంతో స‌మానం. బ‌హుషా అంకాపూర్ గురించి నేను చేసినంత ప్ర‌చారం ఈ ప్ర‌పంచంలో ఎవ‌రూ చేయ‌లేదు. అంత‌మంచి అభ్యుద‌య‌మైన రైతులు. అంకాపూర్ రైతుల చైత‌న్యంతో, వారిని స్ఫూర్తిగా తీసుకొని వంద‌లాది గ్రామాలు ఆర్థికంగా ఎదుగుతున్నాయి అని కేసీఆర్ తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z