ఏదైన అనారోగ్యం కారణంగా ఆసుపత్రికి వెళ్లగానే డాక్టర్ ముందుగా కళ్లతో పాటు, నాలుకను పరీక్షిస్తారు. కళ్లలో, నాలుకలో వచ్చే మార్పుల ఆధారంగా మనిషి ఆరోగ్యాన్ని అంచనా వేస్తుంటారు. ముఖ్యంగా నాలుకలో వచ్చే మార్పుల ఆధారంగా మనిషి ఆరోగ్యాన్ని వైద్యులు తెలుసుకుంటారు. నాలుక రంగులో వచ్చే మార్పులను బట్టి మనిషి ఆరోగ్యం బాగుందా లేదా అనేది అంచనా వేయొచ్చు. అయితే నాలుకలో కనిపించే మార్పులు ఆధారంగా వైద్యులు ఎలాంటి నిర్ధారణకు వస్తారో ఇప్పుడు తెలుసుకుందాం..
- సాధారణంగా ఆరోగ్యకరమైన వ్యక్తి నాలుకు గులాబీ రంగులో ఉంటుంది. లేత గులాబీ, ముదురు గులాబీ రంగులో ఉంటుది. ఇక నాలుకపై సన్నని తెల్లటి పొర ఉంటుంది. ఇక ఆరోగ్యకరమైన వ్యక్తిలో నాలు తేమగా ఉంటుంది.
- ఒకవేళ నాలుకపై తెల్లటి మచ్చలు కనిపిస్తే ఈస్ట్ ఇన్ఫెక్షన్‌కు సంకేతంగా చెప్పొచ్చు. నాలుకపై తెల్లటి మచ్చలు ల్యూకోప్లాకియా వల్ల కనిపిస్తాయి. అయితే దీని వల్ల పెద్దగా అనారోగ్య సమస్యలు లేకపోయినా కొన్ని సందర్భాల్లో మాత్రం క్యాన్సర్‌కు సంకేతంగా కావొచ్చు. దీని ఆధారంగా రోగి ఆరోగ్యాన్ని అంచనా వేస్తారు.
- నాలుక నల్లగా కనిపిస్తే జాగ్రత్త పడాలని నిపుణులు చెబుతున్నారు. గొంతులో బ్యాక్టీరియా, ఫంగస్ వంటి కారణంగా నాలుక నలుపు రంగులోకి మారుతుంది. కొన్ని సందర్భాల్లో నాలుక నలుపు రంగులోకి మారడం క్యాన్సర్‌కు కూడా సూచికగా చెబుతుంటారు. అందుకే ఒకవేళ నాలుక రంగు నలుపులోకి మారితే వెంటనే అలర్ట్ అవ్వాలి.
- ఇక ఒకవేళ నాలుక పసుపు రంగులోకి మారితే కామెర్లుగా భావిస్తుంటాం. అయితే ఇది నిజమే అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో డయాబెటిస్ కూడా సంకేతంగా నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ నాలుక పసుపు రంగులోకి మారుతున్నట్లు కనిపిస్తే షుగర్ పరీక్ష చేయించుకోవడం ఉత్తమం.
- నాలుక ఒకవేళ నీలి రంగులోకి మారినట్లు కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వాలని నిపుణులు చెబుతున్నారు. నాలుక నీలి రంగులోకి మారితే గుండె సంబంధిత వ్యాధులను సూచిస్తుందని చెబుతున్నారు. గుండె శరీరంలో రక్తాన్ని సరిగ్గా పంప్ చేయని సమయంలో నాలుక నీలి రంగులోకి మారుతుంది. రక్తంలో ఆక్సిజన్ సరైన స్థాయిలో లేనప్పుడు కూడా నాలుక నీలి రంగులోకి మారుతుందని నిపుణులు చెబుతున్నారు.
👉 – Please join our whatsapp channel here –