ప్రస్తుతం ఇండస్ట్రీలో ఓటీటీల హవా కొనసాగుతోంది. డైరెక్ట్‌గా ఇందులో విడుదలైన సినిమాలు కూడా సూపర్‌హిట్ అవుతున్నాయి. దీంతో ఈ రంగంపై సినీ ప్రముఖులకు ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ‘ఆహా’ అనే ఓటీటీ వేదికను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఆయన నిర్మాణంలో వచ్చే ప్రాజెక్ట్‌లతో పాటు టాక్‌షోలను కూడా అందులో ప్రసారం చేస్తూ డిజిటల్ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఇదే బాటలో మరో నిర్మాత అడుగులు వేయనున్నారు.
టాలీవుడ్‌లో ఉన్న అగ్ర నిర్మాతల్లో దిల్‌రాజు (DilRaju) ఒకరు. చిన్న సినిమాల కోసం ఆయన ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వీటి కోసం ఆయన ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను స్థాపించనున్నారట.అయితే, దీన్ని ఆయన ఒక్కరే మొదలుపెడతారా లేదంటే సినీ పరిశ్రమకు చెందిన కొందరు ప్రముఖులతో కలిసి స్థాపిస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులను కూడా ప్రారంభించారట. రూ.5కోట్లలోగా బడ్జెట్‌తో దాదాపు 25 చిన్న సినిమాలను నిర్మించి వాటిని ఓటీటీ వేదికగా విడుదల చేయాలని భావిస్తున్నారని టాక్. ఇది 2024లో అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే ఆయన నిర్మించే సినిమాలతో పాటు.. డిస్ట్రిబ్యూట్ చేసే చిత్రాలు కూడా అందులోనే విడుదలయ్యే అవకాశముంది.మొదట డిస్ట్రిబ్యూటర్‌గా సినీ కెరీర్‌ను మొదలుపెట్టిన దిల్‌రాజు ప్రస్తుతం టాలీవుడ్‌లో నంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకున్నారు. శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ నిర్మాణ సంస్థపై హిట్ సినిమాలను నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా చిత్రాలకు కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రసుతం ఆయన బ్యానర్‌లో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతోన్న ‘గేమ్ ఛేంజర్’ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
👉 – Please join our whatsapp channel here –