Devotional

శ్రీకృష్ణుడికి ఎంత మంది తల్లులు తెలుసా?

శ్రీకృష్ణుడికి ఎంత మంది తల్లులు తెలుసా?

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

🌿 విష్ణువు ఎనిమిదవ అవతారంగా వచ్చిన శ్రీకృష్ణుడు ప్రపంచంలో అన్ని కష్టాలను ఓడించే భగవద్గీత అనే జ్ఞానాన్ని మనకు అందించాడు.

🌸పెదవులపై వేణువు, తలలో నెమలి పించం ఉన్న శ్రీకృష్ణుని చూస్తుంటే సర్వ కలలు ఆయనలో ఉన్నాయని అనిపించక మానదు.శ్రీకృష్ణుడు భూమిపై ఉన్నంతకాలం మానవ సంక్షేమం కోసమే బతికాడు.

🌸అంతేకాకుండా కోరి వచ్చిన భక్తుల కోర్కెలను తీర్చేవాడు.శ్రావణ మాసంలోని కృష్ణపక్షం అష్టమి తిథినాడు రోహిణీ నక్షత్రం నందు జన్మించిన శ్రీ కృష్ణునికి ఇద్దరు తల్లులు ఉన్నారు అన్న సంగతి అందరికీ తెలిసినదే.

🌿కానీ శ్రీకృష్ణుడికి ఐదుగురు తల్లులు ఉన్నారు అన్న సంగతి మీకు తెలుసా…తెలియదా ?
అయితే వారు ఎవరు, వారి గురించి ఇక్కడ తెలుసుకుందాం.

🌹1) దేవకి: 🌹

🌸శ్రీకృష్ణుడికి నిజమైన తల్లిదండ్రులు వసుదేవుడు ఆయన సతీమణి అయిన దేవకి.దేవకి తన సోదరుడు కంసుని చెరసాలలో బంధించి అయిన నేపథ్యంలో చెరసాలలో శ్రీకృష్ణుడు జన్మించాడు.

🌿దేవకి అష్టమ సంతానం ద్వారా కంసుడికి మరణ గండం ఉందని తెలుసుకొని, దేవకిని ఆమె భర్తను చెరసాలలో బంధించాడు.దేవకి దేవతలకు తల్లి అయినా అదితి అవతారమని చెబుతారు.

🌸అందుకే శ్రీకృష్ణుడిని నందనుడు, వాసుదేవుడు అని కూడా పిలుస్తారు.

🌹2) యశోద: 🌹

🌿దేవకి ఎనిమిదవ సంతానం అయిన శ్రీకృష్ణుడిని కంసుడు చంపుతాడు అనే ఉద్దేశంతో శ్రీకృష్ణుని చెరసాల నుండి యశోద వద్దకు చేరుతాడు. యశోద శ్రీకృష్ణుడిని పెంచిన తల్లి అయినా కన్నతల్లిలా శ్రీకృష్ణుని పెంచింది.

🌸శ్రీకృష్ణుడు, యశోద, నందుడు దంపతుల దగ్గర గోకులంలో పెరిగాడు.శ్రీకృష్ణుడు తన చిన్నతనంలో ఎన్నో చిలిపి పనులు చేస్తూ ఉండేవాడు.

🌿ఈ నేపథ్యంలో మట్టిని తింటున్నాడు అని మందలించినా యశోదకు తన నోట్లో సృష్టి మొత్తం చూపించి ఆశ్చర్య పరిచేలా చేశాడు.అలా శ్రీకృష్ణుని మందలిస్తూ ఎంతో ప్రేమగా యశోద శ్రీకృష్ణుని పెంచింది.

🌹3) రోహిణి: 🌹

🌸వసుదేవుడు దేవకి కంటే ముందుగా రోహిణిని వివాహం చేసుకొని ఉంటాడు.ఈమెకి బలరాముడు, సుభద్ర జన్మిస్తారు.

🌿దేవకీ వసుదేవుల ఏడవ సంతానమైన బలరాముని రోహిణి గర్భంలో ప్రవేశ పెట్టడం ద్వారా వీరికి బలరాముడు జన్మిస్తాడు.
ఈ విధంగా రోహిణి కూడా కృష్ణుడికి తల్లిలా భావించాడు.

🌹 4) సుముఖీ దేవి:🌹

🌸 సందీపని ముని భార్య అయినా సుముఖీ దేవికి కూడా తల్లి హోదా కల్పించాడు శ్రీకృష్ణుడు.శ్రీకృష్ణుడు సందీ పని ముని దగ్గర విద్యాభ్యాసం చేస్తాడు.

🌿అయితే సుముఖీ దేవి శ్రీకృష్ణుని తన కుమారుడిగా ఉండేలా అడుగుతుంది.కావున శ్రీకృష్ణుడు ఆమెకు కూడా తల్లి హోదా కల్పించాడు.

🌹5) పూతన: 🌹

🌸 పాలు తాగే వయసులో ఉన్న శ్రీకృష్ణుని హతమార్చేందుకు కంసుడు పూతన అనే రాక్షసిని పంపిస్తాడు.తన రొమ్ములలో కాలకూట విషాన్ని నింపుకుని కృష్ణుని హతమార్చాలని చూస్తుంది.

🌿అయితే ఈ విషయాన్ని ముందుగా గ్రహించిన కన్నయ్య, పాలతో పాటు ఆమె శరీరంలోని రక్తం మొత్తం తాగేస్తాడు.

🌸దీనితో ఆమె చనిపోతుంది.దహన సంస్కారాలు నిర్వహించే సమయంలో, కాలిపోతున్న ఆమె దేహం సుగంధ పరిమళాలను వెదజల్లుతాయి.

🌿ఈ ఘటన తర్వాత శ్రీకృష్ణుడు పూతన కు తల్లి హోదా కల్పించాడు…స్వస్తీ….🚩🌞🙏🌹🎻

🙏🌹సర్వం శ్రీ కృష్ణర్పణ మస్తు🌹

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z