Politics

నేడు కోనాయిపల్లికి కేసీఆర్

నేడు కోనాయిపల్లికి కేసీఆర్

సీఎం కేసీఆర్ కాసేపట్లో సిద్ధిపేట జిల్లా నంగునూర్ మండలం కోనాయిపల్లికి చేరుకోనున్నారు. అక్కడ మంత్రి హరీష్ రావు సీఎంకు స్వాగతం పలకనున్నారు. కోనాయిపల్లి వెంకటేశ్వరస్వామిని సీఎం కేసీఆర్ దర్శించుకోనున్నారు. ప్రతీ సారి నామినేషన్ వేసే ముందు సీఎం ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ గజ్వేల్‌తో పాటు, కామారెడ్డిలో కూడా బరిలో దిగుతున్న విషయం తెలసిందే.నామినేషన్ పత్రాలను స్వామి పాదాల వద్ద ఉంచి సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. కాగా, సీఎం కేసీఆర్ ఈనెల 9న ఉదయం గజ్వేల్‌లో.. మధ్యాహ్నం కామారెడ్డిలో నామినేషన్లు వేయనున్నారు. ఇక, 1985 నుంచి ప్రతి ఎన్నికల ముందు సీఎం కేసీఆర్ ఇక్కడ ప్రత్యేక పూజలు చేసిన తర్వాతే నామినేషన్లు వేయడం సెంటిమెంట్‌గా ఉంది. 1985 నుంచి 2018 వరకు సీఎం కేసీఆర్ అన్ని సందర్భాల్లో విజయం సాధించారు. 38 ఏళ్లుగా విజయం సాధిస్తున్న సీఎం కేసీఆర్ ఈ సారి అదే సెంటిమెంట్ కంటిన్యూ చేయాలని భావిస్తున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z