Politics

ఏపీ కేబినెట్‌పై లోకేశ్ ఫైర్

ఏపీ కేబినెట్‌పై లోకేశ్ ఫైర్

ఏపీ కేబినెట్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం కేబినెట్ భేటీ జరిగింది. అయితే ఈ భేటీలో రాష్ట్రంలో ఏర్పడిన కరవు పరిస్థితులపై చర్చించలేదు. కనీసం ప్రస్తావనకు కూడా రాలేదు. దీంతో నారా లోకేశ్ విమర్శలు కురిపించారు. కరవు పరిస్థితులపై చర్చించని కేబినెట్ ఎందుకు అని ప్రశ్నించారు. వర్షాభావ పరిస్థితుల్లో రాష్ట్రంలో చాలా చోట్ల కరవు నెలకొందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మంత్రులు కనీసం సమీక్షించకపోవడం బాధ్యతరాహిత్యమని లోకేశ్ మండిపడ్డారు.రాష్ట్రవ్యాప్తంగా 400 మండలాల్లో కరవు పరిస్థితులు ఉన్నాయని లోకేశ్ తెలిపారు. అయితే ప్రభుత్వం 100 మండలాల్లో మాత్రమే కరవు ఉందని చెప్పడంపై నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. గత వందేళ్లలో ఈ ఏడాది మాత్రమే తక్కువ వర్షపాతం నమోదైందని గణాంకాలు చెబుతున్నాయని చెప్పారు. కర్నూలు జిల్లాలో నెలకొన్న కరవుతో ఊళ్లకు ఊళ్లు ఖాళీ అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షనేతలపై తప్పుడు కేసులు పెడుతున్న శ్రద్ధ రైతులపై పెట్టడంలేదని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా కరవు నివారణపై దృష్టి సారించి.. రైతులను యుద్ధ ప్రతిపదికన ఆదుకోవాలని నారా లోకేశ్ విజ్ఞప్తి చేశారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z