ఈ మధ్య కన్నడ నుంచి వచ్చి తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న చిత్రం ‘సప్త సాగరదాచే ఎల్లో సైడ్-ఏ’ . కేజీఎఫ్, కాంతార, చార్లీ777 వంటి సినిమాల తర్వాత తెలుగు జనాలను అంతలా ఇంపాక్ట్ చేసింది ఈ సినిమానే. రక్షిత్ శెట్టి హీరోగా నటించిన ఈ చిత్రంలో రుక్మిణి (Rukmini) కథానాయికగా నటించింది. హేమంత్ రాజ్ (Hemanth Raj) ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఇక ఈ చిత్రం సెప్టెంబర్ 01న కన్నడలో విడుదలై మంచి విజయం సాధించింది. అయితే ఇదే సినిమాను సప్త సాగరాలు దాటి సైడ్-ఏ అనే పేరుతో తెలుగులో సెప్టెంబర్ 22న విడుదల చేయగా.. ఇక్కడ కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
అయితే ఇది తొలిపార్టు మాత్రమే. ఇక ఈ సినిమా సెకండ్ పార్ట్ ఎప్పుడు వస్తుందా ఎప్పుడెప్పడు చూద్దామా అంటూ ఫ్యాన్స్ ఎదురుచూస్తుండగా.. మేకర్స్ రీసెంట్‌గా విడుదల తేదీ ప్రకటించారు. ఇక ఈ రెండో భాగం సప్త సాగరాలు దాటి సైడ్-బీ (Sapta Sagaralu Dhaati Side-B) నవంబర్ 17న కన్నడతో పాటు మూడు భాషల్లో రిలీజ్ కానుంది. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ఈ మూవీ నుంచి మేకర్స్ ట్రైలర్‌ను విడుదల చేశారు.
ఇక ట్రైలర్ చూస్తే.. మను జైలు నుంచి విడుదలైన 10 సంవత్సరాల అనంతరం ఏం జరిగింది అనేది స్టోరీ అని తెలుస్తుంది. ఇక ఈ రెండో భాగం సప్త సాగరాలు దాటి సైడ్-బీ నవంబర్ 17న కన్నడతో పాటు మూడు భాషల్లో రిలీజ్ కానుంది.ఈ సినిమా సప్త సాగరాలు దాటి సైడ్-ఏ కథ విషయానికొస్తే.. మను, ప్రియ అనే మధ్య తరగతికి చెందిన ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకుని పెళ్లి కూడా చేసుకోవాలని అనుకుంటుంటారు. పెళ్లిచేసుకుని జీవితంలో చాలా సాధించాలని, గొప్పగా ఎదగాలని కలలు కంటుంటారు. మరీ ముఖ్యంగా సముద్రం పక్కన ఓ అందమైన ఇల్లు కట్టుకుని కుంటుంబంతో కలిసి హ్యాపీగా జీవించాలని అనుకుంటారు. అయితే ఓ రాంగ్ డిసీషన్ వల్ల వీళ్ల జీవితాలు తలకిందులైపోతాయి. రక్షిత్ శెట్టి జైలుకు అంకితమైపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? రక్షిత్ శెట్టి జైలుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? చివరకి జైలు నుంచి రక్షిత్ బయటకు వచ్చాడా? అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.
👉 – Please join our whatsapp channel here –