సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి హరీశ్ రావుతో కలిసి ఆలయానికి వచ్చిన గులాబీ బాస్.. తన నామినేషన్ పత్రాలను స్వామి పాదాల వద్ద ఉంచి పూజలు నిర్వహించారు. 1985 నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే సందర్భంగా కేసీఆర్ కోనాయిపల్లి ఆలయంలో నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు చేయడం సెంటిమెంట్‌గా భావిస్తున్నారు. ఆ తర్వాత 1989, 1994, 1999, 2004, 2009, 2014, 2018 ఇలా ప్రతి ఎన్నికల్లోనూ కేసీఆర్ ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈసారి కూడా ఇదే సెంటిమెంట్‌ను ఫాలో అయిన కేసీఆర్ ఈనెల 9న తొలుత గజ్వేల్ ఆ తర్వాత కామారెడ్డిలో నామినేషన్లు దాఖలు చేయనున్నారు.
👉 – Please join our whatsapp channel here –