అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిన్న మెన్నటి వరకు కలిసి పోటీ చేయాలనుకున్న కాంగ్రెస్, సీపీఎం పార్టీల మధ్య పొత్తు చెడింది. సీట్ల కేటాయింపుపై ఇరుపార్టీల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడంతో సీపీఎం పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. తాము అడిగిన స్థానాలు ఇచ్చేందుకు కాంగ్రెస్ విముఖత వ్యక్తం చేయడంతో వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే తమ పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను సీపీఎం పార్టీ విడుదల చేసింది. ఆదివారం 14 మందితో కూడిన ఫస్ట్ లిస్ట్‌ను సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విడుదల చేశారు. తమ్మినేని వీరభద్రం పాలేరు నుండి బరిలోకి దిగుతుండగా.. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మిర్యాలగూడ నుండి పోటీ చేయనున్నారు.
సీపీఎం అభ్యర్థుల జాబితా ఇదే:
1. భద్రాచలం- కారం పుల్లయ్య
2. అశ్వారావుపేట- పి. అర్జున్
3. పాలేరు- తమ్మినేని వీరభద్రం
4. మధిర- పాలడుగు భాస్కర్
5. వైరా- భూక్య వీరభధ్రం
6. ఖమ్మం- శ్రీకాంత్
7. పటాన్ చెరు- మల్లికార్జున్
8. ముషీరాబాద్-దశరథ్
9. సత్తుపల్లి- భారతి
10. మిర్యాలగూడ-జూలకంటి రంగారెడ్డి
11. భువనగిరి- నర్సింహ
12. నకిరేకల్- చినవెంకట్ రెడ్డి
13. జనగామ- కనకారెడ్డి
14. ఇబ్రహీంపట్నం-యాదయ్య
👉 – Please join our whatsapp channel here –