Business

రికార్డులు నెలకొల్పుతున్న హైదరాబాద్‌ మెట్రో

రికార్డులు నెలకొల్పుతున్న హైదరాబాద్‌ మెట్రో

మెట్రో రైళ్లలో రద్దీ గణనీయంగా పెరుగుతున్నది. ఒక రోజులో ప్రయాణం చేసే మెట్రో ప్రయాణికుల సంఖ్య గరిష్ఠ స్థాయికి చే రింది. ఒకే రోజు 5.47 లక్షల మంది మూడు కారిడార్‌లలో ఉన్న మెట్రో మార్గాల్లో రాకపోకలు సాగించారు. మెట్రో సేవలు ప్రారంభమైన ఆరేండ్ల లో ఒక రోజు ప్రయాణికుల సంఖ్య 5.5 లక్షలు చేరువలో ఉండటం ఒక రికార్డుగా అధికారులు పేర్కొంటున్నారు.

నగరంలో అత్యంత కీలకమైన మా ర్గాల్లో మెట్రో రైళ్ల రాకపోకలు ఉండటంతో ఏటా రద్దీ గణనీయంగా పెరుగుతూనే ఉంది. కరోనా ప్రభావం చూపి నా క్రమంగా మెట్రో రైళ్లలో రద్దీ పెరుగుతుండటంతో దానికి అనుగుణంగా మెట్రో అధికారులు రైళ్లను ఆయా మార్గాల్లో నడుపుతున్నారు.

ముఖ్యం గా మహానగరంలో ఐటీ కార్యకలాపాలతో పాటు దసరా, దీపావళి సీజన్‌ల తో సందడి నెలకొని ఉండటంతో నగరంలో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు జోరందుకున్నాయి. ఐటీ కంపెనీల కార్యకలాపాలుండే సోమవారం నుంచి శుక్రవారం వరకు కారిడార్‌-3లో రద్దీ అధికంగా ఉంటున్నదని, ఐటీ ఉద్యోగులు ఎక్కువగా మెట్రో రైళ్లలోనే ప్రయాణం చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని అధికారులు తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z