Politics

జగన్ బహిరంగ వేదికలపై ఎస్సీ ఎస్టీ బీసీలపై ప్రేమ చూపిస్తుంటే

జగన్ బహిరంగ వేదికలపై ఎస్సీ ఎస్టీ బీసీలపై ప్రేమ చూపిస్తుంటే

ఏపీలో పోలీసులు వైకాపా ప్రైవేటు సైన్యంలా మారిపోయి ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై తీవ్ర అణచివేత చర్యలకు పాల్పడుతున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆరోపించారు. ప్రత్యేకించి పుంగనూరు నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆటవిక పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటివరకు ఎటువంటి కేసులేని తెదేపా దళిత నేత ముల్లంగి వెంకటరమణను.. కల్లూరు సీఐ కత్తి శ్రీనివాసులు అక్రమంగా నిర్బంధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతులు వెనక్కి కట్టి, నోట్లో గుడ్డలు కుక్కి చిత్రహింసలకు గురిచేయడం తాలిబన్ల రాజ్యాన్ని గుర్తుకు తెస్తున్నారన్నారు.

ముఖ్యమంత్రి జగన్ బహిరంగ వేదికలపై ఎస్సీ, ఎస్టీ, బీసీలపై లేని ప్రేమలు ఒలకబోస్తుంటే.. వాస్తవంలో ఆయా వర్గాలపై ఇదివరకు ఎన్నడూ లేనివిధంగా దారుణాలు కొనసాగుతున్నాయని ఆరోపించారు. తెదేపా దళిత నేతను అక్రమంగా నిర్బంధించి దాడి చేసిన కల్లూరు సీఐపై రాష్ట్ర డీజీపీ తక్షణమే విచారణ జరిపి.. ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న రాజ్యహింసను నిలువరించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని నారా లోకేశ్‌ కోరారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z