Politics

మోదీ సభలో పాల్గొననున్న పవన్

మోదీ సభలో పాల్గొననున్న పవన్

ఈ నెల 7న తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోడీ రానున్నారు. ఈ సందర్భంగా బీసీ ఆత్మగౌరవ సభలో పాల్గొంటారు ప్రధాని నరేంద్ర మోడీ. అయితే.. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ఈ నెల 7న జరగనున్న బీసీ ఆత్మగౌరవ సభకు పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. ఈ సభలో ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యఅతిథిగా పాల్గొంటుండగా… బిజెపి నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ లు పవన్ ను కూడా ఆహ్వానించారు. అందుకు ఆయన అంగీకరించారు.నరేంద్ర మోదీయే మూడోసారి ప్రధాని కావాలని తాను కోరుకుంటున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. కాగా, జనసేన-బీజేపీ పార్టీల మధ్య పొత్తు ఖరారు అయినట్లు సమాచారం అందుతోంది. నిన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ లు భేటీ అయ్యారు. నిన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి.. తెలంగాణ రాష్ట్రంలో పొత్తులపై చర్చించారు. ఈ తరుణంలోనే.. 12 సీట్లు జన సేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అడిగినట్లు తెలుస్తోంది. ఎక్కువగా ఖమ్మం, హైదరాబాద్‌ జిల్లాలోనే జనసేన బలంగా ఉందని.. ఈ ప్రాంతాల్లోనే ఎక్కువ సీట్లు అడిగారట పవన్‌ కళ్యాణ్.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z