తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల మూడో జాబితా విడుదలైంది. సోమవారం రాత్రి 16 అభ్యర్థులతో హైకమాండ్ జాబితా విడుదల చేసింది. బాన్సువాడ నుంచి ఏనుగు రవీందర్ రెడ్డి, చెన్నూరు నుంచి జీ.వివేకానంద, బోథ్ నుంచి గజేందర్, కామారెడ్డి నుంచి రేవంత్ రెడ్డి, జుక్కల్ నుంచి తోట లక్ష్మీకాంత రావు, నిజామాబాద్ అర్బన్ నుంచి షబ్బీర్ అలీ, కరీంనగర్ నుంచి పురుమళ్ల శ్రీనివాస్, పటాన్ చెరు నుంచి నీలం మధు ముదిరాజ్, సిరిసిల్ల నుంచి కొండం కరుణ మహేందర్ రెడ్డి, నారాయణఖేడ్ నుంచి సురేశ్ కుమార్, వనపర్తి నుంచి మెగా రెడ్డి, డోర్నకల్ నుంచి రామచంద్రు నాయక్, ఇల్లందు నుంచి కోరం కనకయ్య, వైరా నుంచి రామ్ దాస్ మాలోత్, సత్తుపల్లి నుంచి మట్ట రాగమయి, అశ్వారావు పేట నుంచి ఆదినారాయణ నుంచి బరిలో ఉంటారు. కాగా, అనూహ్యంగా వనపర్తి, బోథ్ అభ్యర్థులను కాంగ్రెస్ మార్చింది.
👉 – Please join our whatsapp channel here –