తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐతో పొత్తు ఖాయమైనట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తెలిపారు. కొత్తగూడెం నియోజకవర్గం నుంచి ఆ పార్టీ పోటీ చేయబోతున్నట్లు చెప్పారు. ఆ స్థానంలో సీపీఐ విజయానికి కాంగ్రెస్ కృషి చేస్తుందని చెప్పారు. అధిష్ఠానం ఆదేశాల మేరకు సోమవారం హైదరాబాద్లోని సీపీఐ కార్యాలయానికి వెళ్లిన ఆయన.. ఆ పార్టీ నేతలతో చర్చలు జరిపారు. ఎన్నికల తర్వాత రెండు ఎమ్మెల్సీ స్థానాలను సీపీఐకి ఇస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. పెద్దమనసుతో సహకరించాలని సీపీఐని కోరినట్లు చెప్పారు. కాంగ్రెస్-సీపీఐ సమన్వయం కోసం కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు రేవంత్ తెలిపారు.
👉 – Please join our whatsapp channel here –