NRI-NRT

అడిలైడ్‌లో కాంతారావు శతజయంతి

అడిలైడ్‌లో కాంతారావు శతజయంతి

ప్రముఖ నటుడు టీ.ఎల్.కాంతారావు శతజయంతి వేడుకలు ఆస్ట్రేలియాలోని అడిలైడ్ నగరంలో ఘనంగా నిర్వహించారు. కాంతారావు మునిమనవరాలు వెనిషా “కంచుకోట” చిత్రంలోని పాటకు నాట్యం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాంతారావు జీవిత విశేషాలను ప్రదర్శించారు. ఆయన చలనచిత్రాల్లోని గేయాలను శిల్ప, అపర్ణలు ఆలపించారు. రాజశ్రీ, వాణిశ్రీ, రోజారమణి, మురళీమోహన్‌ల సందేశాన్ని ప్రదర్శించారు. ఆయన కుటుంబ సభ్యులు సుశీలరావు, స్థానిక ప్రవాసులు కటకం రాజన్, ఆదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z