తిరుపతి జిల్లా కేవీబీపురం మండలం పోలినాయుడుకండ్రిగలోని అంగన్వాడీ కేంద్ర నిర్వాహకులు గర్భిణులు, బాలింతలకు ఇటీవల పంపిణీ చేసిన పాలు గడ్డకట్టుకుపోయి.. పురుగులు పట్టాయి. జనవరి 14 వరకూ వాడుకోవచ్చని ఆ టెట్రా ప్యాకెట్లపై ఉంది. దీంతో శనివారం ఓ లబ్ధిదారు ప్యాకెట్లు తెరవగా అందులోని పాలు పూర్తిగా గడ్డకట్టి ఉన్నాయి. వాటిలో తెల్ల పురుగులు కనిపించాయి. దీనిపై అంగన్వాడీ సిబ్బందిని ప్రశ్నిస్తే తమకు వచ్చిన వాటిని పంపిణీ చేశాం.. అంతకు మించి ఏమీ తెలియదని చేతులెత్తేశారు. అంగన్వాడీ సూపర్వైజర్ కల్పలతను వివరణ కోరగా ‘సమస్య మా దృష్టికి రాలేదు. ఆ గ్రామాలను సందర్శించి విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం’ అని చెప్పారు. అక్కచెల్లెమ్మలని ప్రేమ ఒలకబోసే ప్రజాప్రతినిధులు.. పౌషకాహారం ఇంత అధ్వానంగా ఉంటే ఏం పర్యవేక్షిస్తున్నారని మహిళలు ప్రశ్నిస్తున్నారు.
👉 – Please join our whatsapp channel here –