Movies

యాత్ర 2 నుండి కొత్త లుక్

యాత్ర 2 నుండి ఫస్ట్ లుక్ రిలీజ్

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం, ఆయన పాదయాత్ర ఆధారంగా యాత్ర సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ చిత్రానికి కొనసాగింపుగా ఏపీ సీఎం వైఎస్సార్ తనయుడు వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి చేసిన పాదయాత్ర జైలు జీవితం ఆధారంగా మహివి రాఘవ్ యాత్ర2 తీస్తున్నారు. త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్ సంస్థలతో కలిసి శివ మేక నిర్మిస్తున్నారు. యాత్రలో వైఎస్సార్ పాత్ర పోషించిన మమ్ముట్టి యాత్ర2లో మరోసారి ఆ పాత్రలో కనిపించనున్నారు.వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాత్రలో తమిళ హీరో, నిర్మాత ఆర్బీ చౌదరి తనయుడు జీవా నటిస్తున్నారు. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పాత్రను మహేష్ మంజ్రేకర్ పోషిస్తున్నారు. ఈ మూవీలో సోనియాగాంధీ పాత్రలో జర్మన్ నటి సుజానే బెర్నెర్ట్ నటిస్తున్నారని అధికారికంగా వెల్లడించారు. వైఎస్సార్ మరణం తరువాత తెలుగు గడ్డపై జరిగిన రాజకీయాల్లో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ పేరు బలంగానే వినిపించింది. ఆమె పాత్రను ఎలా చూపిస్తున్నారనేది ఈ సినిమా విడుదలైతే తప్ప చెప్పలేం. జర్మన్ నటి సుజానే బెర్నెర్ట్ ఫస్ట్ లుక్ చూస్తూ.. అచ్చం సోనియాగాంధీలా ఉన్నారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నాం.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z