Health

టీ అందించనందుకు సర్జరీని మధ్యలో ఆపేసిన డాక్టర్

టీ అందించనందుకు సర్జరీని మధ్యలో ఆపేసిన డాక్టర్

టీ ఇవ్వలేదని సర్జరీ చేయకుండానే ఆపరేషన్‌ థియేటర్‌ నుంచి ఓ డాక్టర్‌ బయటకు వచ్చేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌ జిల్లాలో జరిగింది. జిల్లాలోని ఖట్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించుకోవడానికి నలుగురు మహిళలు వచ్చారు. వాళ్లకు సర్జరీ చేయటానికి వెళ్లే ముందు డాక్టర్‌ తేజ్‌రామ్‌ భలవి టీ కోసం అక్కడ వాళ్లని అడిగారు. అయితే ఎవరూ డాక్టర్‌కు టీ ఇవ్వలేదు. ఈ క్రమంలో సర్జరీ చేసేందుకు ఆపరేషన్‌ థియేటర్‌కు వెళ్లిన డాక్టర్‌ నలుగురు మహిళలకు మత్తు మందు ఇచ్చారు. టీ ఇవ్వలేదనే కోపంతో సర్జరీలు చేయకుండానే ఆపరేషన్‌ థియేటర్‌ నుంచి బయటకు వెళ్లిపోయారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z